వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అంతర్గత శతృవుల వల్లే ప్రమాదం పొంచి ఉందా? వైసీపీ, సాక్షి హౌస్ లో జగన్ అనుకూల శతృవులున్నారా?  తాజాగా ఈ అనుమానాలు జగన్ క్యాంపులో మొదలయ్యాయి. అందరికీ కనిపించే రాజకీయ ప్రత్యర్ధి చంద్రబాబునాయుడు, టిడిపి అన్న సంగతి అందరికీ తెలిసిందే. మరి, అంతర్గత శతృవులెవరు ? వారిని ఎలా పసిగట్టటం? ఇక్కడే జగన్ సామర్ధ్యం బయటపడుతుంది.

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అంతర్గత శతృవుల వల్లే ప్రమాదం పొంచి ఉందా? వైసీపీ, సాక్షి హౌస్ లో జగన్ అనుకూల శతృవులున్నారా? తాజాగా ఈ అనుమానాలు జగన్ క్యాంపులో మొదలయ్యాయి. అందరికీ కనిపించే రాజకీయ ప్రత్యర్ధి చంద్రబాబునాయుడు, టిడిపి అన్న సంగతి అందరికీ తెలిసిందే. మరి, అంతర్గత శతృవులెవరు ? వారిని ఎలా పసిగట్టటం? ఇక్కడే జగన్ సామర్ధ్యం బయటపడుతుంది. వెలుపలి ప్రత్యర్ధులతో ఎప్పుడైనా, ఎక్కడైనా పోరాటం చేయవచ్చు. కానీ అంతర్గత, అనుకూల శతృవులతో పోరాటం చేయటమే చాలా కష్టమన్న విషయం జగన్ కు తెలియంది కాదు.

జగన్ కు అంతర్గత శతృవులున్నారన్న విషయం ఎప్పటి నుండో వినిపిస్తున్న మాటే. సాక్షి మీడియా హౌస్ లో చంద్రబాబు, టిడిపి అనుకూలురున్నారన్న విష
యమై ఎప్పటి నుండో ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. అందుకు తాజా ఉదాహరణ వైఎస్ భారతికి కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ అవ్వటమే. ‘‘కాల్ మనీ సెక్స్ రాకెట్’’ వార్తలు రాసినందుకు సాక్షి ఎడిటోరియల్ ముఖ్యులకు కోర్టు అరెస్టు వారెంట్ పంపింది. సాక్షి సారధ్య బాధ్యతల్లో ఉన్నారు కాబట్టే జగన్ సతీమణి భారతికి కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది.

వైఎస్ భారతికి కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేయటమంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే, జగన్ను, భారతిని వేర్వేరుగా చూసేందుకు లేదు. భారతికి కోర్టు నోటీసులు వచ్చాయటంటే జగన్ కు వచ్చినట్లే. ఈ విషయాలు జగన్ అభిమానులతో పాటు సాధారణ జనాలను ఎవరిని అడిగినా చెబుతారు. అటువంటిది భారతికి నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ వచ్చేంతవరకూ జగన్ శిబిరంలోని న్యాయనిపుణులు ఏం చేస్తున్నట్లు? అరెస్టు వారెంట్లు జారీ అవుతున్న విషయం ముందుగానే పసిగట్టి తగిన చర్యలు ఎందుకు తీసుకోలేకపోయారు?

ఈరోజు భారతి విషయంలో అయింది రేపు జగన్ విషయంలో అయినా అంతే కదా? జగన్ పాదయాత్ర సందిగ్దంలో పడటానికి కూడా జగన్ శిబిరంలోని న్యాయ నిపుణుల నిర్లక్ష్యమే కారణమని జగన్ అభిమానులు అనుకోవటంలో తప్పేమీ లేదు. ఇంతటి కీలక విషయాల్లో కూడా జగన్ బృందం ఎంత నిర్లక్ష్యంగా ఉందో చెప్పటానికి తాజా ఉదాహరణే నిదర్శనం. కాబట్టి, వెలుపలి ప్రత్యర్ధితో ఎప్పుడైనా పోరాటం చేయవచ్చు. ముందు ఏరేయాల్సింది అంతర్గత, అనుకూల శతృవులనే అన్న విషయం జగన్ గుర్తించాలి.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

https://goo.gl/QU6DGN