తిరుపతికి పాకిన కోడెల ట్యాక్స్: మరిన్ని వార్తలు

By rajesh yFirst Published Aug 27, 2019, 5:53 PM IST
Highlights

నేటి ముఖ్యమైన వార్తలను మీరు మిస్సయ్యారా... అలా మిస్ కాకూడదంటే ఈ కింది వార్తలను సంక్షిప్తంగానే కాకుండా వివరంగా కూడా చదవడానికి వీలుగా అందిస్తున్నాం.
 

59 శాతం ఓట్లతో 103 మంది: 73 శాతంతో జగన్ టాప్

ఏపీ అసెంబ్లీలో 59 శాతం పైగా ఓట్లతో 103 మంది ఎమ్మెల్యేలు అడుగుపెట్టారు. శ్రీదేవీ అనే అభ్యర్ధి తన ప్రత్యర్ధిపై భారీ మెజారిటీతో గలుపొందారు. 

 

టీటీడీ ప్రయోగం విజయవంతం: ఇకపై విద్యార్ధులతోనే హుండీ లెక్కింపు

తిరుమల శ్రీవారి హుండీని విద్యార్థులతో లెక్కించాలన్న టీటీడీ ప్రయోగం విజయవంతమైంది. సాధారణంగా కానుకల లెక్కింపు ప్రక్రియ సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది... అయితే విద్యార్ధులతో లెక్కింపు ప్రక్రియ మాత్రం నిన్న మధ్యాహ్నం 2.30కే పూర్తయ్యింది. దీంతో ఇక నుంచి విద్యార్ధుల చేతే కానుకలు లెక్కించే యోచనలో ఉంది టీటీడీ

 

అమరావతిపై జగన్ ఆలోచన: వెనక్కి తగ్గని టీజీ వెంకటేష్

 రాష్ట్రంలో నాలుగు రాజధానులను ఏర్పాటు చేసేందుకే జగన్ రాష్ట్ర ప్రణాళికా బోర్డును రద్దు చేసి నాలుగు ప్రణాళిక బోర్డులను ఏర్పాటు చేయబోతున్నారని టీజీ వెంకటేష్ చెప్పారు అందుకు అనుగుణంగానే నాలుగు ప్రాంతాలకు నలుగురు ఉప ముఖ్యమంత్రులను నియమించారని ఆయన చెప్పారు. 

 

నాకు అంగుళం భూమి వున్నా చూపించండి: బొత్సకు సుజనా సవాల్

రాజధాని మార్పు అంటే ఒక చొక్కా తీసేసి మరో కొత్త చొక్కా కొనుక్కోవడం కాదని సుజనా వ్యాఖ్యానించారు. అభివృద్ధి వికేంద్రీకరణ అనేది మంచిదేనని... అయితే అప్పటి ప్రభుత్వం రాజధానికి కావాల్సిన అన్ని రకాల ప్రక్రియలను పూర్తిచేసిందని ఇటువంటి పరిస్థితుల్లో బొత్స వ్యాఖ్యలు ప్రజలను ఆందోళనలోకి నెట్టాయని సుజనా ధ్వజమెత్తారు. 

 

'సాహో' ప్రీరిలీజ్ టాక్.. మాస్ కి ఎక్కదా..?

సాహో రిలీజ్‌కి మరో మూడు రోజులే మిగిలి వుంది. దీంతో ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్‌ టాక్స్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇండస్ట్రీ వర్గాల్లో బాగా వినిపిస్తోన్న టాక్‌ అయితే ఇది. 

 

సాహో కోసం నిద్రలేని రాత్రులు గడిపారట

నాలుగేళ్లుగా సాహో సినిమా కోసం వందల మంది పడిన క్లాష్టం అంతా ఇంతా కాదు. ముఖ్యంగా చిత్ర నిర్మాతలు దర్శకుడు అలాగే ఇతర టెక్నీషియన్స్ తీరిక లేకుండా ఒకే సినిమా కోసం కష్టపడ్డారు. ఇక సినిమా మ్యూజిక్ విషయంలో ఎన్నో మార్పులు చేసిన చిత్ర యూనిట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం జిబ్రాన్ ని సెలెక్ట్ చేసుకున్న సంగతి తెలిసిందే. 

 

అమరావతిపై మాటలొద్దు.. ఏం చేస్తారో చెప్పండి: జగన్‌పై కన్నా వ్యాఖ్యలు

రాజధానిని మార్చబోమని చెప్పి.. జగన్ ఇప్పుడు మాట తప్పుతున్నారని విమర్శించారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. సోమవారం బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరితో కలిసి ఆయన రాజధాని ప్రాంతంలోని మందడం, తుళ్లూరు, రాయపూడి గ్రామాల్లో పర్యటించారు.

 

అమరావతిపై బొత్స వ్యాఖ్యల వెనుక జగన్: యనమల

వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై టీడీపీ నేత, శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. టీఆర్ఎస్ రుణం తీర్చుకోవడానికి జగన్ ఏపీలో ఆర్ధికమాంద్యం సృష్టిస్తున్నారని యనమల ఆరోపించారు.  

 

జూ.ఎన్టీఆర్‌పై భరత్ వ్యాఖ్యలు: టీడీపీలో చిచ్చు

బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.భరత్ వ్యాఖ్యల వెనుక మర్మమేమిటనే విషయమై చర్చ సాగుతోంది.

 

జగన్ వ్యూహం ఇదే: చంద్రబాబు పేరు వినిపించకుండా....

 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలి ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి ఆనావళ్లను నామరూపాల్లేకుండా చేయాలనే వ్యూహంతో పనిచేస్తున్నట్లు కనిపిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అమరావతి నిర్మాణాన్ని, పోలవరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 

 

దుప్పట్లో సెక్స్ చేయమన్నాడు.. బిగ్ బాస్ షోపై శ్రీరెడ్డి కామెంట్స్!

నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 ఇటీవల ప్రారంభమై 37 ఎపిసోడ్‌లను పూర్తి చేసింది. అయితే ఈ రియాలిటీ షోపై సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. 
 

సాహో 500 కోట్లు సాధిస్తుందా ?.. హిందీలో పరిస్థితి ఇది!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రం మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంపై ఆకాశాన్ని తాకే అంచనాలు ఉన్నాయనడంలో సందేహం లేదు. సాహో చిత్రం ఓపెనింగ్స్ విషయంలో రికార్డులు క్రియేట్ చేస్తుందనే అంచనాలు మొదలయ్యాయి. 

 

తిరుపతికి పాకిన కోడెల ట్యాక్స్ : ల్యాబ్ టెస్టుల పేరుతో రూ.40 లక్షల దోపిడి

టీడీపీ సీనియర్ నేత, ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు, ఆయన కుమారుడు, కుమార్తెపై ‘‘ కే‘ ట్యాక్స్ పేరుతో బలవంతపు వసూళ్లు, బెదిరింపుల కేసులు నమోదైన సంగతి తెలిసిందే. సత్తెనపల్లి, నరసరావుపేటకే పరిమితమైన ఈ కే ట్యాక్స్ తాజాగా తిరుపతికి పాకింది.

 

మనకు చెడ్డపేరు తెచ్చేందుకు చాలామంది ప్రయత్నిస్తున్నారు: స్పందన రివ్యూలో సీఎం జగన్

సెప్లెంబర్ 5న నూతన ఇసుక పాలసీని అమల్లోకి తీసుకు రాబోతున్నట్లు తెలిపారు.ప్రస్తుతం మార్కెట్లో ఉన్న రేట్లు కన్నా తక్కువ రేట్లకు ఇసుకను అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. ఇసుక సప్లై పెంచాలని లేకపోతే రేట్లు తగ్గే పరిస్థితి ఉండదన్నారు.

 

ప్రభుత్వ పథకాల అమలుకు జగన్ ముహూర్తం: అక్టోబర్ 15న రైతు భరోసా, జనవరి 26న అమ్మఒడి

బ్యాంకు ఖాతాలను తెరవడానికి ఆయా జిల్లా కలెక్టర్లు బ్యాంకర్లతో సమావేశం కావాలని ఏవైనా సమస్యలు ఉంటే వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. ప్రభుత్వం పథకం నుంచి అందే ఏ డబ్బు అయినా నేరుగా లబ్ధిదారులకే చేరాలని స్పష్టం చేశారు. 

 

అసెంబ్లీ ఫర్నీచర్ మాయం కేసులో దోషులను వదలొద్దు : కోడెలపై పురంధేశ్వరి ఫైర్

ఫర్నిచర్‌ మాయమైన ఘటనపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ నుంచి పక్కదారి పట్టిన ఫర్నిచర్‌ విషయంపై పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరపాలని కోరారు. ఫర్నీచర్ తరలింపుకు సంబంధించి కారణమైన దోషులు ఎవరైనా సరే వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. 

 

రాజధాని రైతులకు శుభవార్త: రూ.187.44 కోట్లు విడుదల

ఇకపోతే రాజధానికి భూములు త్యాగం చేసిన తమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కౌలు నిధులు విడుదల చేయలేదంటూ మండిపడుతున్నారు. అలాగే అమరావతిపై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆందోళన బాటపట్టారు. 

 

దోస్తీ కటీఫ్: కేసీఆర్ కు దొరకని మోడీ అపాయింట్ మెంట్

రెండో దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్  ప్రధాని మోడీని కలవలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం కోసం  మోడీ అపాయింట్ మెంట్ కోసం కేసీఆర్ ప్రయత్నిస్తే ఆయనకు అపాయింట్ మెంట్ దక్కలేదు.

 

'సాహో' యాక్షన్ ఫిల్మ్ కాదు.. ప్రభాస్ కామెంట్స్!

సాహోలో భారీ ఛేజింగ్ సీన్లు ఉన్నాయి. హెవీ ఫైట్స్ ఉన్నాయి. ఫారిన్ టెక్నీషియన్స్ కూడా పనిచేశారు. ఈమధ్య కాలంలో తెలుగులో ఇంత భారీ యాక్షన్ సినిమా రాలేదంటున్నారంతా. కానీ ప్రభాస్ మాత్రం సాహోను యాక్షన్ మూవీ కంటే ఎమోషనల్ సినిమాగానే భావిస్తున్నాడు.

 

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు: వర్మ క్యాస్ట్ ఫీలింగ్ సాంగ్

విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే సినిమాకు సంబందించిన ప్రమోషన్ డోస్ ను వర్మ క్యాస్ట్ ఫీలింగ్ తో నడిపిస్తున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా కొత్త తరహాలో క్యాస్ట్ రచ్చకు దారి తీస్తున్న ఆర్జీవీ మొదటి సాంగ్ ని కూడా రిలీజ్ చేశాడు. 

 

ఫైనల్ గా 'ఎవరు' ఎంత కలెక్ట్ చేసింది (ఏరియావైజ్)

‘క్షణం’, ‘గూఢచారి’ చిత్రాలతో  పోస్టర్ వేస్తే జనాలను రప్పించుకునే ఇండిడ్యువల్  మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు  అడివి శేష్. తాజాగా‘ఎవరు’ చిత్రంతో మరోసారి తనను నమ్మి థియోటర్ కు వచ్చిన వాళ్లకు వంద శాతం టిక్కెట్ గిట్టుబాటు చేస్తాననిపించాడు. 

కాంగ్రెస్‌ నేతల తుమ్మిడిహట్టి పర్యటన: బోటులో షికారుకెళ్లారంటూ కేటీఆర్ సెటైర్లు

ప్రాణహిత నదిలో బోటు షికారు చేసి.. కేసీఆర్‌పై విమర్శలు చేశారని కేటీఆర్ ఎద్దేవా చేశారు.  ఉనికిని చాటుకోవడానికి కాంగ్రెస్ పార్టీ నేతలు అపసోపాలు పడుతున్నారని సెటైర్లు వేశారు. 
 

బస్సు కిందకు చిన్నారిని విసిరిన తల్లి: చితకబాదిన స్థానికులు

హైద్రాబాద్ కూకట్ పల్లిలో దారుణం చోటు చేసుకొంది. ఓ తల్లి చిన్నారిని బస్సు కిందకు విసిరేసింది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ఆ చిన్నారి ప్రాణాలతో బయటపడింది.

 

క్యూనెట్ కేసులో సినీ ప్రముఖులకు నోటీసులు

క్యూనెట్ కేసులో సినీ ప్రముఖులకు నోటీసులు ఇస్తామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ ప్రకటించారు. ఈ కేసులో ఇప్పటికే 70 మందిని అరెస్ట్ చేసినట్టుగా ఆయన తెలిపారు.

 

విమర్శిస్తే మన్నించండి... కానీ నీళ్లివ్వండి: కేసీఆర్ కు మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి అభ్యర్థన

కేసీఆర్ తన సొంత ప్రాంతంలో ఎకరానికి రూ.లక్ష ఖర్చు చేసి నీళ్లు ఇస్తున్నారని తాము కూడా తెలంగాణలో ఉన్నాం అని గుర్తు చేశారు. రంగారెడ్డి జిల్లా తెలంగాణలోనే ఉందని తమకు సాగునీరు ఇవ్వాలని కోరారు. లక్ష్మీదేవిపల్లి జలాశయం నిర్మిస్తామని చెప్పి మర్చిపోయారంటూ ఎద్దేవా చేశారు. 


నేను రాజకీయాల్లోకి రాను.. అతడు చెప్పింది అబద్దం : సంజయ్ దత్!

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ రాజకీయాల్లోకి వస్తున్నారని ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. దీనిపై ఆయన సామాజిక మాధ్యమాల ద్వారా స్పందించారు. తాను రాజకీయాల్లోకి రావడంలేదని స్పష్టం చేశారు.

 

హార్డ్ కోర్ ఫ్యాన్స్ కి ప్రభాస్ గోల్డెన్ ఛాన్స్

రెబల్ స్టార్ ప్రభాస్ ని కలిసే అవకాశం వస్తే ఎవరు వదులుకుంటారు. ఏ మాత్రం ఛాన్స్ ఉన్నా అభిమానులు దూసుకుపోతారు. ప్రభాస్ కోసం ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధంగా ఉండే హార్డ్ కొర్ ఫ్యాన్స్ కోసం ఒక అరుదైన అవకాశం వచ్చింది. ప్రభాస్ ఇచ్చిన గోల్డెన్ ఛాన్స్ లో క్లిక్కయితే మీ కల నెరవేరినట్లే. 

 

ఒకే వేదికపైకి పవన్ కళ్యాణ్, మహేష్ బాబు.. కన్నుల పండుగే!

టాలీవుడ్ లో సూపర్ స్టార్ డమ్ సొంతం చేసుకున్న హీరోలు మహేష్, పవన్ కళ్యాణ్. వీరిద్దరూ విశేషమైన అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. కానీ వీరిద్దరూ కలసి కనిపించిన సందర్భాలు చాలా తక్కువ. కెరీర్ ఆరంభంలో పైరసీకి వ్యతిరేకంగా జరిగిన కార్యక్రమంలో కనిపించారంతే. వీరిద్దరిని ఒకే వేదికపై చూడాలని అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. 

 

నల్లమలని నాశనం చేయొద్దు.. కేటీఆర్ కు ట్యాగ్ చేసిన శేఖర్ కమ్ముల

సున్నితమైన చిత్రాల దర్శకుడిగా శేఖర్ కమ్ముల మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఆయన చిత్రాలకు ఫ్యామిలీ ఆడియన్స్, యువతలో మంచి క్రేజ్ ఉంది. శేఖర్ కమ్ముల చివరగా ఫిదా చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నారు. తాజాగా శేఖర్ కమ్ముల సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ ఆసక్తికరంగా మారింది. 

 

click me!