అమరావతి: రాజధానికి భూములు త్యాగం చేసిన రైతులకు ఊరట లభించింది. రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతులకు కౌలు నిధులు విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. 2019-20 సంవత్సరానికి గానూ కౌలు కింద రూ. 187.44 కోట్లు నిధులు విడుదల చేసింది. 

ఇకపోతే రాజధానికి భూములు త్యాగం చేసిన తమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కౌలు నిధులు విడుదల చేయలేదంటూ మండిపడుతున్నారు. అలాగే అమరావతిపై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆందోళన బాటపట్టారు. 

కౌలు నిధులు విడుదల చేయడంతోపాటు రాజధానిని తరలించొద్దని డిమాండ్ చేస్తూ త్వరలోనే పెద్దఎత్తున ఉద్యమించేందుకు రైతులు రెడీ అవుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో అన్ని పార్టీల మద్దతు కూడగడుతున్న సంగతి తెలిసిందే.