హైదరాబాద్: హైద్రాబాద్ కూకట్‌పల్లి భాగ్యనగర్  కాలనీలో దారుణం  చోటు చేసుకొంది. స్వంత కూతురునే ఓ తల్లి బస్సు కిందకు తోసేందుకు ప్రయత్నించింది. అయితే బస్సు డ్రైవర్ అప్రమత్తంగా  వ్యవహరించడంతో బాధితురాలు ప్రాణాలతో బయటపడింది.

బస్సు డ్రైవర్ అప్రమత్తం కావడంతో కూతురు బతికిందని భావించిన ఆ తల్లి ఆ పాపను రోడ్డుపై విసిరేసింది. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన  స్థానికులు ఆ కఠినాత్మురాలికి బుద్ది చెప్పారు.

ఆ తల్లిని పట్టుకొని చెట్టుకు కట్టేసి చితకబాదారు. చిన్నారిని ఆ తల్లి ఎందుకు బస్సు కిందకు విసిరేసిందనే విషయమై కారణాలు తెలియరాలేదు.  ఈ ఘటనకు పాల్పడిన మహిళ ఏ ప్రాంతానికి చెందిందో కూడ తెలియరాలేదు.