మోడీని ప్రశంసించిన శశిథరూర్: నోటీసులు ఇచ్చే యోచనలో కాంగ్రెస్

Published : Aug 27, 2019, 04:06 PM ISTUpdated : Aug 27, 2019, 04:07 PM IST
మోడీని ప్రశంసించిన శశిథరూర్: నోటీసులు ఇచ్చే యోచనలో కాంగ్రెస్

సారాంశం

ప్రధాని మోడీని ప్రశంసించినందుకు కాంగ్రెస్ నేత,  ఆ పార్టీ ఎంపీ శశిథరూర్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకొనే అవకాశాలు ఉన్నాయని సమాచారం. 

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ప్రశంసించిన ఎంపీ శశిథరూర్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.ఈ విషయమై శశిథరూర్ కు కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘ: నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.

ప్రధాని మోడీ చేసే మంచి పనులకు మద్దతు ఇవ్వడంలో తప్పేం ఉందని ఆ పార్టీ నేత జైరామ్ రమేష్ చేసిన వ్యాఖ్యలకు  ఆ పార్టీ నేతలు అభిషేక్ మను  సింఘ్వి, శశిథరూర్ మద్దతు ప్రకటించారు.

మంచి  పనులు చేస్తే మద్దతు ప్రకటించడంలో తప్పేం ఉందని ఆయన ప్రశ్నించారు. అయితే శశి థరూర్ వ్యాఖ్యలపై  కేరళ కాంగ్రెస్ నేతలు గుర్రుగా ఉన్నారు. ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

శశిథరూర్ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని  కోరుతూ కాంగ్రెస్ పార్టీ నేతలు  డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై  కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం  నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.


 

PREV
click me!

Recommended Stories

Indigo కు షాక్: 10 శాతం విమానాలు రద్దు.. రంగంలోకి ప్రత్యేక టీమ్ తో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
ఏఐ ఉద్యోగాలను తగ్గించదు.. పెంచుతుంది : యోగి ఆసక్తికర కామెంట్స్