Asianet News TeluguAsianet News Telugu

క్యూనెట్ కేసులో సినీ ప్రముఖులకు నోటీసులు

క్యూనెట్ కేసులో సినీ ప్రముఖులకు నోటీసులు ఇస్తామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ ప్రకటించారు. ఈ కేసులో ఇప్పటికే 70 మందిని అరెస్ట్ చేసినట్టుగా ఆయన తెలిపారు.

we will issue notice to cine actors on qnet case says sajjanar
Author
Hyderabad, First Published Aug 27, 2019, 4:35 PM IST

హైదరాబాద్: క్యూనెట్  వ్యవహరంలో 38 కేసులు నమోదు చేసి 70 మందిని అరెస్ట్ చేసినట్టుగా సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. క్యూనెట్ కేసు వివరాలను సజ్జనార్ మీడియాకు వివరించారు.

మంగళశారం నాడు ఆయన హైద్రాబాద్ ‌లో మీడియాతో మాట్లాడారు. బెంగుళూరులోని విహాన్ కార్యాలయాన్ని కూడ సీజ్ చేసినట్టుగా ఆయన తెలిపారు.క్యూనెట్ సంస్థ రెండు రకాలుగా అవతారాలతో ప్రజలను మోసగించిందన్నారు. ఇప్పటివరకు రూ. 5 వేల కోట్ల మేర మోసం జరిగిందని  సజ్జనార్ తెలిపారు.

క్యూనెట్ కేసులో   సినీ  ప్రముఖులకు కూడ నోటీసులు పంపినట్టుగా సజ్జనార్ వివరించారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే లక్ష్యంగా జరిగిన ఈ కుంభకోణంలో లక్షల్లో బాధితులు ఉన్నారని సజ్జనార్ తెలిపారు.

నిరుద్యోగుల్లో కూడ చాలా మంది  ఈ సంస్థ బాధితులుగా మారారన్నారు. దేశంలోని ఢిల్లీ, మహారాష్ట్ర, బెంగుళూరులలో పలు కేసుల నమోదైనట్టుగా ఆయన వివరించారు. 206(5) కంపెనీ యాక్ట్ 2013 ప్రకారం విచారణ చేపడుతున్నామన్నారు.

కంపెనీకి సంబంధం లేకుండా నకిలీ డైరెక్టర్లు కోట్లాది రూపాయాలను వాడుకొన్నారని ఆయన చెప్పారు. ప్రజలెవ్వరూ క్యూనెట్‌లో చేరవద్దని ఆయన  సూచించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios