జూ.ఎన్టీఆర్‌పై భరత్ వ్యాఖ్యలు: టీడీపీలో చిచ్చు

First Published 27, Aug 2019, 12:46 PM

బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.భరత్ వ్యాఖ్యల వెనుక మర్మమేమిటనే విషయమై చర్చ సాగుతోంది.

:జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి అవసరం లేదని బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ చేసిన వ్యాఖ్యలు టీడీపీలో చర్చకు దారి తీశాయి. భరత్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో ఓ వర్గం అభిప్రాయమనే ప్రచారం కూడ లేకపోలేదు. జూనియర్ ఎన్టీఆర్‌ కోసం చూస్తున్న వర్గం మాత్రం ఈ వ్యాఖ్యలతో నీరుగారి పోయింది.

ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగిన ఎన్నికల్లో ఏపీ రాష్ట్రంలో టీడీపీ ఘోరంగా పరాజయం పాలైంది. కేవలం 23 అసెంబ్లీ, 3 ఎంపీ స్థానాలను మాత్రమే సరిపెట్టుకొంది. ఈ ఫలితాలపై చంద్రబాబునాయుడు ఖంగు తిన్నారు. ఈ ఫలితాలు ఎలా వచ్చాయో అర్ధం కావడం లేదని ఆయన పలు మార్లు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

ఈ ఎన్నికల ఫలితాలపై పార్టీ నేతలు సమీక్షల పేరుతో మల్లగుల్లాలు పడుతున్నారు. ఇదే సమయంలో చాలా మంది ప్రజా ప్రతినిధులు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. ఇప్పటికే టీడీపీకి చెందిన నలుగుు రాజ్యసభ ఎంపీలు బీజేపీ తీర్థం పుచ్చుకొన్నారు. ఈ నలుగురు కూడ చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు కావడం గమనార్హం.

23 మంది ఎమ్మెల్యేల్లో కొందరు బీజేపీ, వైఎస్ఆర్‌సీపీ వైపు చూస్తున్నారనే ప్రచారం కూడ సాగుతోంది. దీనికి తోడుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో బలంగా ఉన్న నేతలకు బీజేపీ గాలం వేస్తోంది. ఈ తరుణంలో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు గాను చరిష్మా నాయకుడు కావాలనే చర్చ కూడ లేకపోలేదు.

ఈ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ పేరు కూడ తెర మీదికి వచ్చింది. 2019 ఎన్నికలకు ముందు జూనియర్ ఎన్టీఆర్ మామా నార్నేశ్రీనివాసరావు వైఎస్ఆర్‌సీపీలో చేరాడు. అంతేకాదు చంద్రబాబు.పై ఆయన తీవ్ర విమర్శలు చేశాడు.

ఈ ఎన్నికల్లో సినిమా షూటింగ్ బిజీ పేరుతో జూనియర్ ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారానికి కూడ దూరంగా ఉన్నారు. తెలంగాణలో గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో కూకట్ పల్లి నుండి పోటీచేసిన నందమూరి సుహాసిని తరపున కూడ జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం నిర్వహించలేదు.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 2009లో జరిగిన ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఖమ్మంలో ప్రచారం ముగించుకొని తిరిగి వస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కూడ ఆయన టీడీపీకి ఓటేయాలని కోరాడు.2014, 2019 ఎన్నికల్లో ఆయన టీడీపీ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించలేదు.

హరికృష్ణ మృతిని పురస్కరించుకొని రెండు వారాల క్రితం హైద్రాబాద్ లో జరిగిన కార్యక్రమంలో చంద్రబాబునాయుడు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో జూనియర్ తో బాబు మాట్లాడుతున్న ఫోటోలు మీడియాకు విడుదల చేశారు.

జూనియర్ ఎన్టీఆర్ పార్టీ తరపున ప్రచారం నిర్వహించడం కానీ, పార్టీ కోసం పనిచేయడం వల్ల పార్టీలో మరింత ఉత్సాహం వస్తోందనే భావించే వారు కూడ పార్టీలో లేకపోలేదు. అయితే జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి వస్తే పరిస్థితులు ఎలా మారిపోతాయనే చర్చ కూడ లేకపోలేదు.

పార్టీలో చేరాలనే అభిప్రాయం జూనియర్ ఎన్టీఆర్ కు ఉందో లేదో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ ను చేర్చుకొనే విషయమై నాయకత్వం కూడ ఆలోచించాల్సిన అవసరం ఉందని కూడ భరత్ కుండబద్దలు కొట్టారు.

భరత్ చేసిన ఈ వ్యాఖ్యలు మాత్రం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి.2019 ఏప్రిల్ మాసంలో జరిగిన ఎన్నికల్లో విశాఖ ఎంపీ స్థానం నుండి భరత్ పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. రాజకీయాలకు ఆయన కొత్త భరత్ చేసిన వ్యాఖ్యలు మాత్రం రాజకీయాలకు కొత్తగా వచ్చిన వ్యక్తి చేసినట్టుగా లేవు.

జూనియర్ ఎన్టీఆర్ కంటే పార్టీలో చాలా మంది యూత్ లీడర్లు పార్టీలో ఉన్నారని ఆయన కుండబద్దలు కొట్టారు. యూత్ లీడర్లకు పార్టీ సరైన బాధ్యతలను అప్పగిస్తే పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు పనిచేస్తారని ఆయన స్పష్టం చేశారు.

ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం కలకలం సృష్టిస్తున్నాయి. భరత్ స్వంతంగా చేసిన వ్యాఖ్యలేనా.. లేక ఈ వ్యాఖ్యల వెనుక పార్టీ అంతర్గతంగా ఏమైనా చర్చ జరిగిందా అనే అనుమానాలు కూడ వ్యక్తమౌతున్నాయి.

టీడీపీలోకి జూనియర్ వస్తే కొందరికి ఇబ్బందులు ఉండొచ్చు... మరికొందరికి ప్రయోజనం కలిగే అవకాశం ఉండొచ్చు..తమ ప్రయోజనాలకు అనుగుణంగా ఆయా వర్గాలు ఈ విషయమై మాట్లాడుతున్నారనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. భరత్ వ్యాఖ్యలు కూడ ఈ కోవలోకే వస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

భరత్ వ్యాఖ్యలపై టీడీపీ మాత్రం స్పందించలేదు. అత్యంత సున్నితమైన ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించకపోతే పార్టీకి తీవ్రంగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.దీంతో ఈ విషయమై ప్రస్తుతానికి టీడీపీ మౌనంగా ఉండే అవకాశం లేకపోలేదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

loader