రెబల్ స్టార్ ప్రభాస్ ని కలిసే అవకాశం వస్తే ఎవరు వదులుకుంటారు. ఏ మాత్రం ఛాన్స్ ఉన్నా అభిమానులు దూసుకుపోతారు. ప్రభాస్ కోసం ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధంగా ఉండే హార్డ్ కొర్ ఫ్యాన్స్ కోసం ఒక అరుదైన అవకాశం వచ్చింది. ప్రభాస్ ఇచ్చిన గోల్డెన్ ఛాన్స్ లో క్లిక్కయితే మీ కల నెరవేరినట్లే. 

కేవలం ప్రభాస్ పోస్టర్ తో ఒక సెల్ఫీ దిగి ప్రభాస్ ఇన్స్టాగ్రామ్ ఐడిని ట్యాగ్ తో ఫొటోను పోస్ట్ చేయాలి. అందులో బెస్ట్ ఫ్యాన్ ని సెలెక్ట్ చేసి పర్సనల్ గా కలుసుకుంటాను అని ప్రభాస్ వివరణ ఇచ్చాడు. ప్రభాస్ చెప్పిన కొన్ని సెకన్లకే హార్డ్ కొర్ ఫ్యాన్స్ వారి స్టయిల్లో ప్రభాస్ ని మెప్పించేందుకు సెల్ఫీలు పోస్ట్ చేస్తున్నారు. మరి ఆ అదృష్టం ఎవరిని వరిస్తుందో చూద్దాం. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Prabhas (@actorprabhas) on Aug 26, 2019 at 9:30pm PDT