Asianet News TeluguAsianet News Telugu

నేను రాజకీయాల్లోకి రాను.. అతడు చెప్పింది అబద్దం : సంజయ్ దత్!

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ రాజకీయాల్లోకి వస్తున్నారని ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. దీనిపై ఆయన సామాజిక మాధ్యమాల ద్వారా స్పందించారు. తాను రాజకీయాల్లోకి రావడంలేదని స్పష్టం చేశారు.
 

bollywood actor sanjay dutt reply on entering politics
Author
Hyderabad, First Published Aug 27, 2019, 12:11 PM IST

ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ రాజకీయాల్లోకి వెళ్లబోతున్నారని నిన్నటి నుండి వార్తలు వినిపిస్తున్నాయి. దానికి కారణం సంజయ్ దత్ ఇటీవల రాష్ట్రీయ సమాజ్ పక్ష పార్టీ నేత మహాదేవ్ జంకర్‌ను కలిశారు.ఆ తరువాత మీడియా ముందుకొచ్చిన మహదేవ్ జంకర్ సంజయ్ తన పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు.

సెప్టెంబర్ 25న సంజయ్ దత్ తన పార్టీ చేరబోతున్నట్లు డేట్ కూడా అనౌన్స్ చేశాడు. అయితే జంకర్ చెప్పిన మాటల్లో నిజం లేదని అంటున్నాడు సంజయ్ దత్. తాను ఎలాంటి పార్టీలో చేరడం లేదని స్పష్టం చేశాడు.

'నేను ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదు. జంకర్ నాకు సోదరుడు, స్నేహితుడు లాంటివారు. భవిష్యత్తులో ఆయన రాజకీయ నాయకుడు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నాను' అని తెలిపారు.పదేళ్ల క్రితం సంజయ్ సమాజ్ వాది పార్టీ తరఫున లక్నో నుండి పోటీ చేశారు.

ఆ తరువాత అక్రమ ఆయుధాలు కలిగిన కేసులో కొన్నేళ్లపాటు జైలు శిక్ష అనుభవించారు. జైలు నుండి తిరిగొచ్చిన సంజయ్ ప్రస్తుతం సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. తెలుగులో సక్సెస్ అందుకున్న 'ప్రస్థానం' సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఆ సినిమా సంజయ్ లీడ్ రోల్ పోషిస్తున్నాడు. 

రాజకీయాల్లోకి స్టార్ హీరో ఎంట్రీ..!

Follow Us:
Download App:
  • android
  • ios