టాలీవుడ్ లో సూపర్ స్టార్ డమ్ సొంతం చేసుకున్న హీరోలు మహేష్, పవన్ కళ్యాణ్. వీరిద్దరూ విశేషమైన అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. కానీ వీరిద్దరూ కలసి కనిపించిన సందర్భాలు చాలా తక్కువ. కెరీర్ ఆరంభంలో పైరసీకి వ్యతిరేకంగా జరిగిన కార్యక్రమంలో కనిపించారంతే. వీరిద్దరిని ఒకే వేదికపై చూడాలని అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. 

ఆ సమయం రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భాంగా సెప్టెంబర్ 8న రజతోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు. దీనికి కర్టెన్ రైజింగ్ ప్రెస్ మీట్ ని కూడా టి సుబ్బిరామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. రాజశేఖర్, సి కళ్యాణ్, సంపూర్ణేష్ బాబు, సందీప్ కిషన్ లాంటి ప్రముఖులు ఈ ప్రెస్ మీట్ కు హాజరయ్యారు. 

సెప్టెంబర్ 8న జరిగే ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథులుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు హాజరు కాబోతున్నట్లు టాక్. సినీవర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే నిర్వాహకులు పవన్ కళ్యాణ్, మహేష్ బాబుని కలసి వారిని ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

చాలా కాలం తర్వాత ప్రొడక్షన్ మేనేజర్లు నిర్వహిస్తున్న ఈవెంట్ కావడంతో పవన్, మహేష్ హాజరయ్యేందుకు సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. పవన్, మహేష్ ఒకే వేదికపై కనిపిస్తే అభిమానుల సంతోషానికి అవధులు ఉండవు.