ప్రభాస్ నటించిన 'సాహో' మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా ఎలా ఉండబోతుందనే విషయంలో కొన్ని లీకులు అందుతున్నాయి. సెన్సార్ జరిగిన తరువాత సినిమాకి సంబంధించి కొన్ని విషయాలు బయటకొచ్చాయి.

ఇప్పుడు ఈ సినిమా ప్రీరిలీజ్ టాక్ అంటూ సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ కనిపిస్తున్నాయి.  ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోన్న టాక్ ప్రకారం.. 'సాహో' స్క్రీన్ ప్లే చాలా ఆసక్తికరంగా సాగుతుందట. ఊహించని విధంగా సినిమాలో మలుపులు ఉంటాయని అంటున్నారు. యాక్షన్ సీన్స్ ఎంతో థ్రిల్లింగ్ గా ఉంటాయని.. ట్విస్ట్ లు బాగా ఆకట్టుకుంటాయని చెబుతున్నారు. 

దర్శకుడు సుజీత్ స్క్రీన్ ప్లే డిఫరెంట్ గా ఉండాలని సరికొత్తగా తీర్చిదిద్ధాడని చెబుతున్నారు. అయితే సినిమాలో మలుపులు, స్క్రీన్ ప్లే మాస్ ఆడియన్స్ ని తికమక పెట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు. తెరపై ఒక్కోసారి ఏం జరుగుతుందనే కన్ఫ్యూషన్ ఏర్పడుతుందని.. తెలివిగా ఆలోచిస్తేనే కొన్ని సీన్లు కనెక్ట్ అవుతాయని అంటున్నారు.

దాని బట్టి చూసుకుంటే.. సినిమాలో మాస్ అప్పీల్ ఎంత ఉంటుందనే దానిపై అనుమానాలు  వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే విడుదలైన సినిమాలో పాటలు మాస్ కి పెద్దగా ఎక్కలేదని చెప్పాలి. మరి సినిమా బీ, సీ సెంటర్స్ లో ఎంతవరకు ఆడుతుందో చూడాలి!