నటి శ్రీరెడ్డి తరచూ తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటుంది. తాజాగా బిగ్ బాస్ షోపై ఆమె సంచలన కామెంట్స్ చేసింది. బిగ్ బాస్ సీజన్ 3లో ఆఫర్ ఇస్తామని తనను సంప్రదించారని.. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ దగ్గర గోల్కొండ హోటల్ కి తనను రామ్మన్నట్లు చెప్పింది. 

అక్కడ అభిషేక్ అనే వ్యక్తి తనను కలిశాడని.. హౌస్ లో ఎలా ఉండాలో చెప్పే ప్రాసెస్ లో ఆయన మాట్లాడిన మాటలు అసభ్యకరంగా ఉన్నాయని తెలిపింది. హౌస్ లోకి వెళ్లిన తరువాత అక్కడ ఎవరోకరితో కనెక్షన్ పెట్టుకోవాలని.. అది నీకు ఇష్టమేనా..? అని అభిషేక్ తనను ప్రశ్నించినట్లు చెప్పుకొచ్చింది.

ముందు లోపాలకి పంపండి ఆ తరువాత చూద్దామని చెప్పినట్లు వెల్లడించింది. అక్కడితో ఆగకుండా 'మీకు దుప్పటి లోపల సెక్స్ చేయడం ఇష్టమేనా..? కెమెరాలు ఉన్నా ఆ పని చేస్తారా..?' అని అభిషేక్ తనను ప్రశ్నించినట్లు శ్రీరెడ్డి చెప్పింది. అతడు సరదాగా అంటున్నాడేమోనని సిగ్గులేకుండా సెక్స్ చేసే టైప్ కాదని నవ్వుతూనే సమాధానం చెప్పినట్లు  వెల్లడించింది.

ఆ తరువాత చిన్న చిన్న బట్టలు వేసుకోవడం ఇష్టమేనా అని అడిగితే.. దానికి పెద్దగా ఇబ్బంది లేదని చెప్పిందట. ఇలా డిస్కషన్ అవుతున్న సందర్భంలో అభిషేక్ కమిట్మెంట్ ఇస్తావా? అని డైరెక్ట్‌గా అడిగినట్లు శ్రీరెడ్డి తెలిపింది. చివరగా తనకు బిగ్ బాస్ 3లో ఛాన్స్ రాకపోవడం బాధగా లేదని.. తనకు ఆ షోపై పెద్దగా ఆసక్తి లేదని చెప్పుకొచ్చింది.  

టాలీవుడ్ ఫ్యూచర్ ఇక వీళ్ల చేతిలోనే!

హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్దమవుతున్న స్టార్ కిడ్స్