విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే సినిమాకు సంబందించిన ప్రమోషన్ డోస్ ను వర్మ క్యాస్ట్ ఫీలింగ్ తో నడిపిస్తున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా కొత్త తరహాలో క్యాస్ట్ రచ్చకు దారి తీస్తున్న ఆర్జీవీ మొదటి సాంగ్ ని కూడా రిలీజ్ చేశాడు. 

ముందుగా పాటకు సంబందించిన భావంతో అదిరిపోయే వాయిస్ ఓవర్ ఇచ్చిన వర్మ దానికి కొనసాగింపుగా పాటను సొంతంగా పడటం విశేషం. సిరా శ్రీ రాసిన ఈ పాటకు రవి శంకర్ మ్యూజిక్ అందించాడు. ఇక సాంగ్ లో రాజకీయ నాయకుల నుంచి స్టార్ సెలబ్రేటిస్ వరకు అందరిని ఫోకస్ చేసాడు వర్మ. మరి ఈ సాంగ్ తో తన సినిమాపై వర్మ ఎలాంటి హైప్ క్రియేట్ చేస్తాడో చూడాలి.