అమరావతిపై బొత్స సంచలనం: మరిన్ని వార్తలు

By rajesh yFirst Published Aug 20, 2019, 5:58 PM IST
Highlights

నేటి ముఖ్యమైన వార్తలను మీరు మిస్సయ్యారా... అలా మిస్ కాకూడదంటే ఈ కింది వార్తలను సంక్షిప్తంగానే కాకుండా వివరంగా కూడా చదవడానికి వీలుగా అందిస్తున్నాం.
 

జగన్‌కు షాక్: రివర్స్ టెండరింగ్‌పై పీపీఏను నివేదిక కోరిన కేంద్రం

పోలవరం ప్రాజెక్టు  నిర్మాణ పనులకు రివర్స్ టెండరింగ్ ఆహ్వానించడాన్ని కేంద్రం తప్పుబట్టింది.ఈ విషయమై కేంద్రం పీపీఏ ను నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

 

అసెంబ్లీ ఫర్నిచర్ మాయం: కోడెల మెడకు మరో ఉచ్చు..?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఫర్నిచర్ మాయమైందన్న వార్తలు రాష్ట్రంలో కలకలం రేపుతున్నాయి. గతంలో హైదరాబాద్ నుంచి తరలించేటప్పుడు.... కోడెల స్పీకర్‌గా ఉన్నప్పుడే ఫర్నిచర్ పోయిందని అసెంబ్లీ వర్గాలు చెబుతున్నాయి.


తన ఆరోగ్యంపై షాకింగ్ విషయం బయటపెట్టిన అమితాబ్!

‘గతంలో నాకు క్షయ(టిబి), హెపటైటిస్ బి వ్యాధులు ఉండేది. క్షయ సోకిందనే విషయం 8 ఏళ్ల వరకు తెలియలేదు. రెగ్యులర్‍‌ గా మెడికల్ చెకప్ చేయించుకోకపోవడమే ఇందుకు కారణం. దీంతో నా 75 శాతం లివర్(కాలేయం) చెడిపోయింది. ప్రస్తుతం నేను 25 శాతం కాలేయంతోనే సర్వైవ్ అవుతున్నాను’ అని అమితాబ్ బచ్చన్ తెలిపాడు.
 

ఆంధ్రా,తెలంగాణాలలో 'సాహో' ప్రీమియర్ షో.. డిటేల్స్!

ఆగ‌ష్టు 30న భారీ ఎత్తున ప్రపంచ‌వ్యాప్తంగా విడుద‌ల అవుతున్న సాహో చిత్రం అదే స్దాయిలో ప్రీమియర్ షోలతో ముందు రోజు అలరించనుంది. ఈ మేరకు ఆంధ్రా, తెలంగాణాలలో మల్టిఫ్లెక్స్ లలో ఏర్పాట్లు చేస్తున్నారు. 29 రోజు రాత్రి ఈ షోలు పడనున్నాయి. 

 

వరదల్లో చిక్కుకున్న సినీ నటి..!

మూడు రోజుల నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో హిమాచల్‌ ప్రదేశ్‌ కుదేలయ్యింది. భారీ వరదలు, కొండ చరియలు విరిగి పడుతుండటం, రోడ్లు కొట్టుకుపోతుండటం వల్ల జనాలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. 
 

అసెంబ్లీ ఫర్నిచర్ నేనే వాడుకున్నా..డబ్బులు కట్టేస్తా: కోడెల

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఫర్నిచర్ మాయమైన ఘటనపై టీడీపీ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు స్పందించారు. హైదరాబాద్ నుంచి అమరావతికి సామాన్లు తరలించేటప్పుడు.. కొంత ఫర్నిచర్‌ను తాను వినియోగించుకున్నట్లు స్పష్టం చేశారు

 

అన్నా క్యాంటీన్‌ను తెరిచిన టీడీపీ ఎమ్మెల్యే: సొంత డబ్బుతో రూ.5కే భోజనం

వైఎస్ జగన్ ప్రభుత్వం మూసివేసిన అన్నా క్యాంటీన్‌లను తిరిగి తెరవాలంటూ తెలుగుదేశం నేతలు గత కొద్దిరోజులుగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీడీపీ నేత, విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కుమార్ అన్నా క్యాంటీన్లను తానే నడుపుతానంటూ రంగంలోకి దిగారు

 

నా ఇంటిని ముంచబోయి పేదోళ్ల ఇళ్లు ముంచారు: జగన్ సర్కార్ పై చంద్రబాబు ఫైర్

వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం ఫ్లడ్ మానిటరింగ్ కూడా చేయలేకపోయిందని విమర్శించారు. ఎన్నడూ లేని విధంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. ముంపునకు గురై ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలను పట్టించుకోకుండా తన ఇంటి చుట్టే తిరిగారని ఆరోపించారు. 

 

ఆర్టీసీ ఉద్యోగులు ఇక ప్రభుత్వ ఉద్యోగులే..?: కేబినెట్ సబ్ కమిటీకి అందిన మధ్యంతర నివేదిక

ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం ఆర్టీసీ విలీనంపై అధ్యయన కమిటీ, కేబినెట్ సబ్ కమిటీలను నియమించిన సంగతి తెలిసిందేనన్నారు. మధ్యంతర నివేదికను అధ్యయన కమిటీ అందజేసిందని నివేదిక ఆధారంగా నిర్ణయాలు ఉంటాయన్నారు. 

 

వారం రోజుల తర్వాత ప్రజలు గుర్తుకు వచ్చారా, అంతా పబ్లిసిటీ కోసమే : చంద్రబాబుపై బొత్స

వరదలు వచ్చిన వారం రోజుల తర్వాత ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ప్రజలు గుర్తుకు వచ్చారా? అని బొత్స నిలదీశారు. తమ ప్రభుత్వం ఎలాంటి దోపిడీ, అనవసరపు పబ్లిసిటీ లేకుండా వరద బాధితులని ఆదుకుందన్నారు. చంద్రబాబు ఇల్లు మునిగిపోతే మంత్రులు ఆ ప్రాంతంలో వెంటనే పర్యటించారనే ఉక్రోషంతో టీడీపీ నేతలు విమర్శలకు దిగుతున్నారని ఆరోపించారు. 
 

సామాన్యుడు చేస్తే దొంగతనం, మీరు చేస్తే ఒప్పా: కోడెలపై మంత్రి కన్నబాబు ఫైర్

అసెంబ్లీలో భద్రత లేని కారణంగానే ఇంటికి తీసుకెళ్లానని కోడెల చెప్పడం విడ్డూరంగా ఉందంటూ విమర్శించారు. అసెంబ్లీలో లేని భద్రత ఆయన ఇంట్లో ఉంటుందా అంటూ నిలదీశారు. ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా అంటూ ప్రశ్నించారు. 
 

 

అమరావతిపై మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన కామెంట్స్

అమరావతిపై ఏపీ మంత్రి బొత్స సత్సనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించినున్నట్టు ఆయన తేల్చి చెప్పారు.

 

హూజూర్‌నగర్ అడ్డా ఉత్తమ్‌దేనా, కారు దూసుకెళ్ళేనా.....

హూజూర్ నగర్ ఉప ఎన్నికల్లో సత్తా చాటుకొనేందుకు కాంగ్రెస్, టీఆర్ఎస్ ల మధ్య పోటీ తీవ్రంగా నెలకొనే అవకాశం ఉంది.

 

కమలం వైపు డీఎస్.. సంకేతాలిచ్చిన తనయుడు అర్వింద్

తన తండ్రి, టీఆర్ఎస్ నేత డి. శ్రీనివాస్ బీజేపీ వైపు అడుగులు వేస్తారని స్పష్టమైన సంకేతాలిచ్చారు..  నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. కొద్దిరోజుల క్రితం బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాను డీఎస్ కలవడంతో ఆయన కాషాయ తీర్ధం పుచ్చుకోనున్నారని ప్రచారం జరిగింది. 

 

హైదరాబాద్ మెట్రోలో పాము.. పరుగులు తీసిన ప్రయాణికులు

ఎల్బీనగర్‌ వద్ద ఓ మెట్రో రైలులో పాము కనిపించిందన్న సమాచారంతో ఈనెల 14 నుంచి ఆ రైలును నిలిపివేశారు. అప్పటి నుంచి పాము కోసం ఆ రైలును మెట్రో స్టేషన్‌లోనే ఉంచి తనిఖీలు చేపట్టారు. 

 

వాటి జోలికి వస్తే రావణకాష్టమే: ఆర్ఎస్ఎస్ కు పొన్నం ప్రభాకర్ వార్నింగ్

రిజర్వేషన్లపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన దేశంలో ఇప్పటకీ అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయని ఆరోపించారు. అసమానతల వల్లే రిజర్వేషన్లను కొనసాగించాలని సూచించారు. 

 

జేపీ నడ్డాకు కేటీఆర్ సవాల్: మీనాన్న అనుమతి తీసుకున్నారా అంటూ విజయశాంతి సెటైర్లు

కేటీఆర్ సవాల్ పై విజయశాంతి వ్యంగ్యంగా స్పందించారు. కేటీఆర్ .. సవాల్ విసిరే ముందు మీ తండ్రి కేసీఆర్ అనుమతి తీసుకున్నారా?’’ అంటూ ప్రశ్నించారు. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల విషయంలో కూడా కేటీఆర్ ఇలాగే సవాల్ విసిరారని గుర్తు చేశారు. 
 

 

వాషింగ్టన్ పోస్టులో ప్రణయ్, అమృతల కథనం

అమృత, ప్రణయ్ కథనాన్ని వాషింగ్టన్ పోస్టు ప్రచురించింది. దేశంలో ఈ తరహ ఘటనలను కూడ ఆ కథనంలో ప్రస్తావించింది.

 

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో నయా దందా: స్వీట్ బాక్స్ లో విదేశీ కరెన్సీ, ఇద్దరు అరెస్ట్

శంషాబాద్ విమానాశ్రయంలో డీఆర్ఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అయితే దుబాయ్- హైదరాబాద్ ఇండిగో విమానంలో నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులను డీఆర్ఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు. వారిని పరిశీలించగా వారి వద్ద నుంచి ఒక స్వీట్ బాక్స్ ను స్వాధీనం చేసుకున్నారు. 
 

రాజ్ తరుణ్ కారుకి యాక్సిడెంట్.. త్రుటిలో తప్పిన ప్రమాదం!

టాలీవుడ్‌ యంగ్‌ హీరో రాజ్‌తరుణ్‌కు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు నార్సింగ్‌ సమీపంలో అల్కాపూర్‌ వద్ద ఔటర్‌ రింగ్‌రోడ్డుపై ప్రమాదానికి గురైంది.
 

 

ఔటర్‌పై రోడ్డు ప్రమాదం: ప్రాణాలతో బయటపడ్డ హీరో తరుణ్

రోడ్డు ప్రమాదం నుంచి సినీనటుడు తరుణ్ తృుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. హైదరాబాద్ ఔటర్‌ రింగ్ రోడ్డు నార్సింగి పరిధిలోని అల్కాపూర్‌‌లో తరుణ్ ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టింది.  ఈ ప్రమాదంలో తరుణ్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదం తర్వాత ఆయన మరో కారులో వెళ్లిపోయారని స్థానికులు చెబుతున్నారు.  దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

 

యాక్సిడెంట్ వార్తపై తరుణ్ రియాక్షన్!

హైదరాబాద్ ఔటర్‌ రింగ్ రోడ్డు నార్సింగి పరిధిలోని అల్కాపూర్‌‌లో తరుణ్ ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టిందని.. ఈ ప్రమాదంలో తరుణ్‌కు ఎలాంటి గాయాలు కాలేదని.. యాక్సిడెంట్ తరువాత తరుణ్ మరొక కార్ లో వెళ్లినట్లు కొన్ని ఛానెల్స్ టెలికాస్ట్ చేశాయి. 

 

తెరపైకి చంద్రబాబు కుట్ర స్టోరీలు... విజయసాయి రెడ్డి మండిపాటు

చంద్రబాబు తెరపైకి కుట్ర స్టోరీలు తీసుకువస్తున్నారని విజయసాయి రెడ్డి ఆరోపించారు. కృష్ణా నది కరకట్ట వద్ద ఉన్న చంద్రబాబు నివాసానికి వరద ముప్పు ఉందని... దానిని వెంటనే చంద్రబాబు ఖాళీ చేయాలని అధికార పార్టీ నేతలు చెబుతున్న సంగతి తెలిసిందే.
 

 

కృష్ణపట్నం పోర్టు: జగన్ కు ఆదానీ గ్రూప్ షాక్

కృష్ణపట్నం పోర్టులో మెజారిటీ వాటాను దక్కించుకొనేందుకు అదానీ గ్రూప్ సానుకూలంగా ఉంది. చర్చలు తుది దశలో ఉన్నాయి. అదే జరిగితే రామాయపట్నంలో పోర్టు నిర్మించాలని జగన్  కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చినా పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చంటున్నారు.

 

అధికారుల నిర్లక్ష్యం..పరీక్షల్లో ఫెయిల్: డిగ్రీ విద్యార్ధి ఆత్మహత్య

తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యానికి ఓ విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రాక్టీకల్ మార్కులు కలపకుండానే డిగ్రీ ఫలితాలు విడుదల చేశారు అధికారులు. ఈ ఫలితాల్లో దాదాపు 250 మంది విద్యార్ధులు పరీక్షల్లో ఫెయిల్ అయ్యారు. పరీక్షల్లో తప్పడంతో హరి అనే విద్యార్ధి మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఒకేరోజు పది సినిమాలు.. బాక్సాఫీస్ బిజీ బిజీ!

ఈ శుక్రవారం టాలీవుడ్‌ బాక్సాఫీస్ ముందు చిన్న సినిమా పండుగ జరగనుంది. పెద్ద హీరోలు బరిలో లేకపోవటంతో, నెలాఖరున సాహో మేనియా మొదలవుతుండటంతో చిన్న సినిమాలన్ని ఆగస్టు 23న రిలీజ్‌కు క్యూ కట్టాయి. 
 

 

కారు వదిలేసి పారిపోయిన రాజ్ తరుణ్.. అసలేం జరిగిందంటే..?

టాలీవుడ్‌ యంగ్‌ హీరో రాజ్‌తరుణ్‌కు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు నార్సింగ్‌ సమీపంలో అల్కాపూర్‌ వద్ద ఔటర్‌ రింగ్‌రోడ్డుపై ప్రమాదానికి గురైంది.

 

'సాహో’ సాంగ్...జాక్వెలిన్‌ కు షాకిచ్చే రెమ్యునేషన్ !.

ప్రభాస్‌తో కలిసి శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ డాన్స్ చేశారు. ఎటు చూసినా అమ్మాయిలు..మధ్యలో బ్యాడ్ బోయ్ మరులు గొలిపేలా మెరిసిపోయారు.  ‘మేబీ ఐ యామ్‌ ఎ బ్యాడ్‌ బాయ్‌ కెన్‌ యు బి మై బ్యాక్‌బోన్‌ హాయ్‌ బేబీ సో..’ అంటూ తెలుగు, ఇంగ్లీషు కలగలిపి ఈ పాట సాగింది. 

 

అఫీషియల్ లుక్: వావ్.. స్టైలిష్ బాలయ్య కేక!

టాలీవుడ్ లో ఎంత మంది స్టార్ హిరోలున్నా బాలకృష్ణ కి ఉండే క్రేజ్ చాలా డిఫరెంట్ అని చెప్పాలి. ఇక కాలం మారే కొద్దీ ఈ సీనియర్ హీరో కూడా సరికొత్త గెటప్స్ లో దర్శనమిస్తున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా తన నెక్స్ట్ సినిమాలో కనిపించనున్నట్లు స్పెషల్ లుక్ తో చెప్పేశాడు. 

 

హీరోలకు, నిర్మాతలకు దూరంగా 'సాహో' డైరెక్టర్!

రెండో సినిమాకే 250 కోట్ల బడ్జెట్ చేతిలోకి తీసుకున్నాాడు సుజిత్. అంతర్జాతీయ స్థాయిలో ఓ సినిమా తీసే అవకాశం దక్కింది.

 

సాహోలో ట్విస్ట్ అదేనా.. ప్రభాస్ రెండు గెటప్పుల్లో ఎందుకు!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో విడుదల సమయం దగ్గరపడే కొద్దీ సినిమాపై అంచనాలు పెరుగిపోతున్నాయి. ఈ చిత్రం కథపై ఇప్పటికే అభిమానుల్లో అనేక ఊహాగానాలున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ చిత్రంలో ప్రభాస్ రెండు గెటప్స్ లో కనిపిస్తుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. 

 

బుమ్రాతో ప్రేమ.. కన్ఫర్మ్ చేసిన అనుపమ..?

ఇటీవల 'రాక్షసుడు' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందుకొచ్చిన ఆమెకి మరోసారి జస్ప్రీత్ బుమ్రాకి సంబంధించినప్రశ్నలు అడగడంతో 'నో కామెంట్' అని బదులిచ్చింది. కానీ తాజాగా ఆమె ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన పోస్ట్ చూస్తే మాత్రం అనుమానాలు రాకమానవు. 


 

click me!