టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ ప్రయాణిస్తోన్న కారు యాక్సిడెంట్ కి గురైంది. మంగళవారం తెల్లవారుజామున నార్సింగి వద్ద అల్కాపూర్ ఔటర్ రింగ్ రోడ్డుపై రాజ్ తరుణ్ కారుకి యాక్సిడెంట్ జరిగింది. ఈ యాక్సిడెంట్ జరిగింది హీరో తరుణ్ కి అంటూ మొదట వార్తలు వినిపించాయి.

కానీ తరుణ్ తనకు ఎలాంటి యాక్సిడెంట్ జరగలేదని.. కార్ కూడా సేఫ్ గా ఉందని వెల్లడించారు. యాక్సిడెంట్ జరిగిన ప్రదేశం నుండి కారుని వదిలేసి వెళ్లిపోతున్న వ్యక్తి హీరో రాజ్ తరుణ్ అని సీసీటీవీ ఫుటేజీ ద్వారా పోలీసులు గుర్తించారు.

ఆటోమేటిక్ గేరు ఉన్న కారు కావడంతో సాంకేతికంగా ఎలా నడపాలో తెలియక.. వేగాన్ని అదుపు చేయలేకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. కారు స్పీడ్ గా వెళ్లి డివైడర్ ని ఢీకొట్టడంతో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. కారులో ఉండే ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో ప్రమాదం తప్పింది. 

చిన్న చిన్న గాయాలతో రాజ్ తరుణ్ బయటపడ్డాడు. ప్రమాదం జరిగిన కారు నెంబర్ టి.ఎస్.09 ఇ.ఎక్స్. 1100 అని తెలిసింది. యాక్సిడెంట్ జరిగిన తరువాత ఆ కారుని అక్కడే వదిలేసి రాజ్ తరుణ్ పరుగులు తీశాడు. ప్రస్తుతం నార్సింగి పోలీసులు కేసుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ కుర్రహీరో 'ఇద్దరి లోకం ఒకటే' అనే సినిమాలో నటిస్తున్నారు. 

ఔటర్‌పై రోడ్డు ప్రమాదం: ప్రాణాలతో బయటపడ్డ హీరో తరుణ్

రాజ్ తరుణ్ కారుకి యాక్సిడెంట్.. త్రుటిలో తప్పిన ప్రమాదం!