హైదరాబాద్: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విజయశాంతి. ఈనెల 18న తెలంగాణ పర్యటనలో బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

కేసీఆర్ ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. నడ్డా వ్యాఖ్యలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నడ్డా చెప్పినవన్నీ పచ్చి అబద్దాలంటూ తిప్పికొట్టారు. అంతేకాదు దమ్ముంటే అవినీతిపై ఆధారాలు చూపించాలంటూ సవాల్ విసిరారు. 

కేటీఆర్ సవాల్ పై విజయశాంతి వ్యంగ్యంగా స్పందించారు. కేటీఆర్ .. సవాల్ విసిరే ముందు మీ తండ్రి కేసీఆర్ అనుమతి తీసుకున్నారా?’’ అంటూ ప్రశ్నించారు. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల విషయంలో కూడా కేటీఆర్ ఇలాగే సవాల్ విసిరారని గుర్తు చేశారు. 

విద్యార్థుల ఆత్మహత్యలకు గ్లోబరీనా సంస్థ నిర్లక్ష్యమే కారణమని, ఈ గ్లోబరీనా సంస్థకు టీఆర్ఎస్ పెద్దలతో సంబంధాలు ఉన్నాయని తనతో పాటూ ప్రతిపక్షనేతలు చాలా మంది ఆరోపించినప్పుడు కూడా కేటీఆర్ ఇదే రకంగా వాదించారంటూ మండిపడ్డారు. తమపై ఆరోపణలు చేసేవారు దమ్ముంటే ఆధారాలు చూపించాలంటూ సవాల్ విసిరారని గుర్తు చేశారు. 

ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై ఆధారాలతో సహా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఫిర్యాదు చేయడంతో, ఈ మొత్తం ఉదంతంపై విచారణ జరిపి, నివేదిక ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని రాష్ట్రపతి ఆదేశించిన విషయాన్ని ప్రస్తావించారు. 

రాష్ట్రపతి ఆదేశాలతో ఖంగుతిన్న కేసీఆర్ ఆ తప్పిదాన్ని ప్రతిపక్షాలపై నెట్టే ప్రయత్నం చేశారంటూ మండిపడ్డారు. అదంతా ప్రతిపక్షాల కుట్ర అని, అనవసరంగా తమను బద్నామ్ చేస్తున్నారంటూ గగ్గోలు పెడుతున్నారంటూ ధ్వజమెత్తారు. 

ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని విమర్శించే ముందు కేటీఆర్ ఎందుకు సవాల్ విసిరారో కేసీఆర్ తెలుసుకుంటే మంచిదని విజయశాంతి వ్యాఖ్యానించారు. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై సాక్ష్యాధారాలు ఇచ్చినట్లుగానే ఇప్పుడు బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా కేంద్రానికి కేసీఆర్ అవినీతిపై ఆధారాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

కేసీఆర్ ప్రభుత్వంపై ఆధారాలను కేంద్రానికి ఇస్తే తాను సంతోషిస్తానని చెప్పుకొచ్చారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపి, వాస్తవాలను వెలుగులోకి తేవాలని తెలంగాణ ప్రజలు సైతం జేపీ నడ్డాను కోరుతున్నట్లు విజయశాంతి చెప్పుకొచ్చారు. 

ఈ వార్తలు కూడా చదవండి

కర్ణాటక తరహా డ్రామాలు తెలంగాణలో సాగవు: బీజేపీపై కేటీఆర్

మెక్కిందంతా కక్కిస్తాం-నిగ్గు తేలుస్తాం, స్థాయి మరచి మాట్లాడకు: కేటీఆర్ కు బీజేపీ చీఫ్ వార్నింగ్

కర్ణాటక తరహా డ్రామాలు తెలంగాణలో సాగవు: బీజేపీపై కేటీఆర్

కార్యకర్తల గొంతు కోశారు, నన్ను అడ్డుకున్నారు : టీడీపీలో అవమానాలపై గరికపాటి కంటతడి

దేశాన్ని ప్రగతిపథంలో నడిపించే సత్తా బీజేపీకే ఉంది: జేపీ నడ్డా

తల్లిలాంటి టీడీపీని వదిలి మనసు చంపుకుని బీజేపీలో చేరుతున్నా: గరికపాటి

హైదరాబాద్‌లో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా పర్యటన (ఫోటోలు)

మన టార్గెట్ బీజేపీ జెండా ఎగురవేయడమే: టీ-బీజేపీ నేతలతో జేపీ నడ్డా

శంషాబాద్‌ చేరుకున్న జేపీ నడ్డా, ఘనస్వాగతం పలికిన నేతలు