సుజీత్ డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా నటించిన సాహో మూవీ ఈ నెల 30న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ సరసన శ్రద్ధాకపూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా యూనిట్ ప్రస్తుతం ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ క్రమంలోనే సినిమాలోని సాంగ్స్ ను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూ సాహోపై అంచనాలను పెంచుతుంది. ఇప్పటికే ఈ సినిమాలోని సైకో.., ఏ చోట నువ్వున్నా.. అనే రెండు సాంగ్స్ రాగా..సోమవారం మరో సాంగ్ ను రిలీజ్ చేశారు. బ్యాడ్‌ బాయ్‌ అనే సాంగ్  ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇందులో ప్రభాస్‌తో కలిసి శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ డాన్స్ చేశారు. ఎటు చూసినా అమ్మాయిలు..మధ్యలో బ్యాడ్ బోయ్ మరులు గొలిపేలా మెరిసిపోయారు.  ‘మేబీ ఐ యామ్‌ ఎ బ్యాడ్‌ బాయ్‌ కెన్‌ యు బి మై బ్యాక్‌బోన్‌ హాయ్‌ బేబీ సో..’ అంటూ తెలుగు, ఇంగ్లీషు కలగలిపి ఈ పాట సాగింది. జాక్వెలిన్‌ డ్యాన్స్‌, బ్యాటీ ఈ  పాటకు స్పెషల్ ఎట్రాక్షగా నిలిచాయి. ఆమె, ప్రభాస్‌కు మధ్య కెమిస్ట్రీ కుదిరిందని, అదిరిపోయిందని.  

సినిమాలో ప్రబాస్ ఇంట్రడక్షన్ సాంగ్ గా  దీన్ని చూపించబోతున్నట్లు  చెప్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ పాటకు  జాక్వెలిన్‌ ఎంత తీసుకుందనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు..రెండు కోట్ల రూపాయలని జాక్విలన్ కు పే చేసినట్లు చెప్తున్నారు. కేవలం ఒక్క పాటకే ఆమెకు ఈ రెమ్యునేషన్ ఇచ్చారని తెలిసి ఆశ్చర్యపోతున్నారు. అయితే ఆ పాటకు వచ్చిన క్రేజ్ కూడా అదే రేంజిలో ఉంది.