హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అక్రమార్కుల నయాదందా బట్టబయలైంది. విదేశాలకు చెందిన కరెన్సీని అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన ఇద్దరు మాయగాళ్లు డీఆర్ఐ అధికారులకు అడ్డంగా బుక్కయ్యారు.  

శంషాబాద్ విమానాశ్రయంలో డీఆర్ఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అయితే దుబాయ్- హైదరాబాద్ ఇండిగో విమానంలో నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులను డీఆర్ఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు. వారిని పరిశీలించగా వారి వద్ద నుంచి ఒక స్వీట్ బాక్స్ ను స్వాధీనం చేసుకున్నారు. 

స్వీట్ బాక్స్ ను క్షుణ్ణంగా డీఆర్ఐ అధికారులు పరిశీలించారు. స్వీట్ బాక్స్ చివరన రూ.3.50లక్షల సౌదీరియాల్స్ ను పట్టుకున్నారు. వాటి విలువ భారత్ లో సుమారు రూ.3కోట్లు విలువ ఉంటుంది. అనంతరం ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన డీఆర్ఐ అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.