టాలీవుడ్ లో ఎంత మంది స్టార్ హిరోలున్నా బాలకృష్ణ కి ఉండే క్రేజ్ చాలా డిఫరెంట్ అని చెప్పాలి. ఇక కాలం మారే కొద్దీ ఈ సీనియర్ హీరో కూడా సరికొత్త గెటప్స్ లో దర్శనమిస్తున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా తన నెక్స్ట్ సినిమాలో కనిపించనున్నట్లు స్పెషల్ లుక్ తో చెప్పేశాడు. 

మొన్నటి నుంచి బాలకృష్ణ న్యూ లుక్ కి సంబందించిన ఒక లుక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే అందులో కనిపిస్తోంది నిజంగా మన బాలయ్యేనా అని సందేహాలు గట్టిగానే వచ్చాయి. అది ఫోటో షాప్ పిక్ అని కూడా టాక్ వచ్చింది. ఇక ఆ రూమర్స్ కి ఒక్క లుక్ తో బాలయ్య చెక్ పెట్టేశారు. సూటు బూటు వేసుకొని ఒక ప్రొఫెషినల్ బిజినెస్ మెన్ లా దర్శనమిచ్చాడు. 

బాలకృష్ణ ఫొటోలోనే ఈ రేంజ్ లో కనిపిస్తున్నాడు అంటే ఇక సినిమాలో తప్పకుండ అభిమానుల అంచనాలకు మించి ఉంటాడని చెప్పవచ్చు.