పాత కార్లను కూడ నడపరు: మిగ్ -21 జెట్ ఫైటర్లపై ఎయిర్ చీఫ్ మార్షల్

By narsimha lodeFirst Published Aug 20, 2019, 5:09 PM IST
Highlights

మిగ్ 21 జెట్ ఫైటర్లను ఇంకా ఉపయోగించడంపై భారత ఎయిర్ మార్షల్ సెటైర్లు వేశారు. పాత కార్లను కూడ ఎవరు నడపడం లేదన్నారు. 


న్యూఢిల్లీ: పాత కార్లను ఎవరూ కూడ ఉపయోగించరు..కానీ 44 ఏళ్ల నాటి మిగ్-21 జెట్ ఎయిర్ ఫైటర్లను ఉపయోగిస్తున్నామంటూ భారత ఎయిర్ చీఫ్ మార్షల్ బిఎస్ ధనోవా సెటైర్లు వేశారు.

నాలుగు దశాబ్దాల నాటికి మిగ్ 21 జెట్ విమానాలను వాడడం వల్ల ప్రయోజనం ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.ప్రత్యర్ధి పాకిస్తాన్  అత్యంత ఆధునాతనమైన ఎప్16 జెట్ విమానాలను ఉపయోగిస్తోంది.

ఇండియన్ ఎయిర్ పోర్స్ లో  జరిగిన ఓ సెమినార్ లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమక్షంలోనే భారత ఎయిర్ చీఫ్ మార్షల్ ఈ వ్యాఖ్యలు చేశారు.

రష్యా జెట్ ఫైటర్ మిగ్ 21 రకం విమానాలను దశలవారీగా తొలగిస్తామని ధనోవా చెప్పారు. ఏళ్ల తరబడి సర్వీస్ కారణంగా ఎక్కువగా ఇండియాలో తయారు చేసిన వస్తువులతోనే ఈ విమానంలో ఉపయోగిస్తున్నట్టుగా ఆయన గుర్తు చేశారు. రష్యా మిగ్ 21 జెట్ ఫైటర్లను ఉపయోగించడం లేదన్నారు. 

1973-74 లో భారత ఆర్మీలో మిగ్ 21 విమానాలు  చేరాయి. ఇటీవల కాలంలో అభినందన్ వర్ధమాన్  మిగ్ 21 విమానంతో పాక్ కు చెందిన  ఎప్ 16 విమానాన్ని వెంటాడాడు. కానీ, మిగ్ 21 విమానం కుప్పకూలిపోయింది. అబినందన్ వర్ధమాన్  పాక్  కు  బందీగా చిక్కాడు. 

110 మిగ్  21 విమానాలు మిగ్ 21 బైసన్ గా 2006లో అప్‌గ్రేడ్ అయ్యాయి.2017 మే మాసంలో  నాలుగు ఎయిర్ క్రాఫ్ట్‌లు మిస్సయ్యాయి. మిగ్ 21 జెట్ ఫైటర్లు గత ఏడాది కుప్పకూలిపోయాయి.

click me!