గత కొద్ది రోజుల క్రితం హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, క్రికెటర్ బుమ్రా మధ్య ఏదో నడుస్తోందంటూ వార్తలు వచ్చాయి. అందుకు కారణం సోషల్ మీడియాలో ఇద్దరూ ఒకరినొకరు ఫాలో అవ్వడమే కారణం. అంతేకాకుండా బుమ్రా ఫాలో అవుతున్న ఒకైక నటి అనుపమ అవ్వడంతో ఈ వార్తలకు బలాన్ని చేకూర్చాయి. 

అయితే..  తమ మధ్య అలాంటిదేమీ లేదని గతంలో అనుపమ తెలిపింది. ఇటీవల 'రాక్షసుడు' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందుకొచ్చిన ఆమెకి మరోసారి జస్ప్రీత్ బుమ్రాకి సంబంధించిన ప్రశ్నలు అడగడంతో 'నో కామెంట్' అని బదులిచ్చింది.

కానీ తాజాగా ఆమె ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన పోస్ట్ చూస్తే మాత్రం అనుమానాలు రాకమానవు. లవ్ సింబల్స్ తో 'i a n j you' అని మూడు పోస్ట్ లు పెట్టింది ఈ బ్యూటీ.  అర్ధమయ్యి అర్ధం కాకుండా పోస్ట్ పెట్టి తన తెలివి ప్రదర్శించింది.

పోస్ట్ చూసిన నెటిజన్లు 'a' అంటే అనుపమ అని 'J' అంటే జస్ప్రీత్ బుమ్రా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఒకరకంగా అనుపమ తన ప్రేమను కన్ఫర్మ్ చేసినట్లు కనిపిస్తోంది. మరి దీనిపై ఆమె ఎలా స్పందిస్తుందో చూడాలి!

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by anupamaparameswaran (@anupamaparameswaran96) on Aug 19, 2019 at 11:12pm PDT

 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by anupamaparameswaran (@anupamaparameswaran96) on Aug 19, 2019 at 11:13pm PDT

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by anupamaparameswaran (@anupamaparameswaran96) on Aug 19, 2019 at 11:13pm PDT