రోడ్డు ప్రమాదం నుంచి సినీనటుడు తరుణ్ తృుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. హైదరాబాద్ ఔటర్‌ రింగ్ రోడ్డు నార్సింగి పరిధిలోని అల్కాపూర్‌‌లో తరుణ్ ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టింది.  ఈ ప్రమాదంలో తరుణ్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదం తర్వాత ఆయన మరో కారులో వెళ్లిపోయారని స్థానికులు చెబుతున్నారు.  దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.