సినీ నటుడు తరుణ్ కి కార్ యాక్సిడెంట్ జరిగినట్లు వార్తలు వచ్చాయి. హైదరాబాద్ ఔటర్‌ రింగ్ రోడ్డు నార్సింగి పరిధిలోని అల్కాపూర్‌‌లో తరుణ్ ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టిందని.. ఈ ప్రమాదంలో తరుణ్‌కు ఎలాంటి గాయాలు కాలేదని.. యాక్సిడెంట్ తరువాత తరుణ్ మరొక కార్ లో వెళ్లినట్లు కొన్ని ఛానెల్స్ టెలికాస్ట్ చేశాయి.

అయితే ఈ వార్తల్లో నిజం లేదని తరుణ్ అధికారికంగా వెల్లడించారు. యాక్సిడెంట్ వార్త అవాస్తవమని, యాక్సిడెంట్ అయిన కారుకి.. తనకు ఎలాంటి సంబంధం లేదని.. రాత్రి నుండి తాను ఇంటి వద్దే ఉన్నానని.. తన కారు కూడా క్షేమంగానే ఉందని తెలిపారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. గతేడాది 'ఇది నా లవ్ స్టోరీ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు తరుణ్. కానీ ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. ప్రస్తుతం తన తదుపరి సినిమా పనుల్లో బిజీగా గడుపుతున్నాడు. 

ఔటర్‌పై రోడ్డు ప్రమాదం: ప్రాణాలతో బయటపడ్డ హీరో తరుణ్