తన తండ్రి, టీఆర్ఎస్ నేత డి. శ్రీనివాస్ బీజేపీ వైపు అడుగులు వేస్తారని స్పష్టమైన సంకేతాలిచ్చారు..  నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. సోమవారం నిజామాబాద్‌లో జరిగిన పార్టీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ....జిల్లాకు నిజామాబాద్ పేరు ఉండటాన్ని ప్రజలు అరిష్టంగా భావిస్తున్నారన్నారు.

పేరులో నిజాం ఉండటం వల్ల నిజాంసాగర్ నిండటం లేదని...నిజాం షుగర్స్ మూత పడింది.. నిజామాబాద్ రైతులు బాగుపడటం లేదని పేర్కొన్నారు. దీనిని వెంటనే ఇందూరుగా మార్చాలన్న డిమాండ్ ప్రజల నుంచి వస్తుందని అర్వింద్ పేర్కొన్నారు.

తనను నమ్మి బీజేపీలో చేరుతున్న డీఎస్ అనుచర వర్గానికి అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు. ప్రస్తుతం కాంగ్రెస్‌కు దిశానిర్దేశం చేసే నాయకుడు లేడని అర్వింద్ ఎద్దేవా చేశారు.

ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370లను రద్దు చేసిన ప్రధాని మోడీ .. దేశంలో కామన్ సివిల్ కోడ్‌ను తీసుకొచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కాగా.. కొద్దిరోజుల క్రితం బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాను డీఎస్ కలవడంతో ఆయన కాషాయ తీర్ధం పుచ్చుకోనున్నారని ప్రచారం జరిగింది. 

అమిత్ షాతో డిఎస్ భేటీపై కేసీఆర్ ఆరా: దొరికితే వేటు

అమిత్ షాతో డిఎస్ భేటీ: మతలబు ఏమిటి?

కవిత ఓటమి ఎఫెక్ట్: టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీకి డిఎస్?

కేసీఆర్ వ్యూహం ముందు డిఎస్ పల్టీ: నేతల భవిష్యత్తు ఆగం

సోనియాతో భేటీ: తెర వెనక వ్యూహరచనలో డిఎస్

సొంత గూటికి: రాహుల్ గాంధీతో డిఎస్ భేటీ

కాంగ్రెసులో చేరుతున్నారనే వార్తలపై డిఎస్ స్పందన

డిఎస్ కాంగ్రెసులో చేరరట: మరి ఎటు వైపు..

టీఆర్ఎస్ కు గుడ్ బై ఖాయం: డిఎస్ రహస్య భేటీ

తేల్చేసిన దత్తాత్రేయ: బిజెపిలోకి డిఎస్ ఖాయం, కేసీఆర్ కు షాక్