హైదరాబాద్ మెట్రో రైలులో పాము కలకలం రేపింది. మెట్రో రైలులో ఓ పాము కనిపించడంతో ప్రయాణికులు కంగారుపడ్డారు.  ఎల్బీనగర్‌ వద్ద ఓ మెట్రో రైలులో పాము కనిపించిందన్న సమాచారంతో ఈనెల 14 నుంచి ఆ రైలును నిలిపివేశారు. అప్పటి నుంచి పాము కోసం ఆ రైలును మెట్రో స్టేషన్‌లోనే ఉంచి తనిఖీలు చేపట్టారు. నిన్న సాయంత్రం స్నేక్‌ సొసైటీ సభ్యులు పామును పట్టుకున్నారు. ఈ విషయాన్ని మెట్రో అధికారులు ఈరోజు వెల్లడించారు. ప్రమాణికుల భద్రత కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.