యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో విడుదల సమయం దగ్గరపడే కొద్దీ సినిమాపై అంచనాలు పెరుగిపోతున్నాయి. ఈ చిత్రం కథపై ఇప్పటికే అభిమానుల్లో అనేక ఊహాగానాలున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ చిత్రంలో ప్రభాస్ రెండు గెటప్స్ లో కనిపిస్తుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. 

అసలింతకీ ఈ చిత్రంలో ప్రభాస్ సింగిల్ రోల్ లో నటిస్తున్నాడా లేక డ్యూయెల్ రోలా అనే సందేహాలు మొదలయ్యాయి. సాహో పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ని గమనిస్తే ప్రభాస్ హెయిర్ స్టైల్ రెండు రకాలుగా కనిపిస్తోంది. ట్రిమ్ చేసుకుని క్లాస్ లుక్ లో, మరో లుక్ లో రఫ్ గా కనిపిస్తున్నాడు. 

ట్రైలర్ లో ప్రభాస్ పాత్రని అండర్ కవర్ కాప్ గా పరిచయం చేశారు. కానీ ప్రభాస్ దొంగగా నటిస్తున్నాడని కూడా వార్తలొస్తున్నాయి. చనిపోయిన తన స్నేహితుల కోసమే అని అంటున్నారు. దర్శకుడు సుజిత్ మాత్రం కథ గురించి ఎక్కడా ఎలాంటి హింట్ ఇవ్వలేదు. 300 కోట్ల భారీ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ హాట్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఐటెం సాంగ్ లో మెరిసింది.