యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అత్యంత భారీ బ‌డ్జెట్ తో హై స్టాండ‌ర్డ్స్ టెక్నాల‌జీతో తెరెకెక్కిస్తున్న చిత్రం ‘సాహో’.  ఆగ‌ష్టు 30న భారీ ఎత్తున  ప్రపంచ‌వ్యాప్తంగా విడుద‌ల అవుతున్న ఈ చిత్రం అదే స్దాయిలో ప్రీమియర్ షోలతో ముందు రోజు అలరించనుంది. ఈ మేరకు ఆంధ్రా, తెలంగాణాలలో మల్టిఫ్లెక్స్ లలో ఏర్పాట్లు చేస్తున్నారు. 29 రోజు రాత్రి ఈ షోలు పడనున్నాయి. 

అయితే ఓవర్ సీస్ ప్రీమియర్స్ పై ఇంకా ఏ క్లాలిటీ రాలేదు. యష్ రాజ్ ఫిల్మ్స్ వారు ఓవర్ సీస్ లో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో  అమెరికాలో 29న ప్రీమియ‌ర్ షోలు ఉంటాయా? లేదా? అన్న దానిపై కొద్ది రోజులుగా స‌స్పెన్స్ కొన‌సాగుతోంది. మరో ప్రక్క ఓ రోజు ముందుగానే లోకల్ మార్కెట్లో సాహో తన పవర్ చూపించనుంది. 
 

మల్టిఫ్లెక్స్ లలో రాత్రి పది గంటలకు , సింగిల్ స్క్రీన్స్ లో ఎర్లీ మార్నింగ్ షోలు ఉదయం నాలుగు గంటల నుంచే ప్రారంభం కానున్నాయి. అయితే అధికారికంగా అనుమతులు తీసుకుని ఎనౌన్సమెంట్ వస్తుంది. ఈ మేరకు డిస్కషన్స్ జరుగుతున్నాయి. ట్రేడ్ సర్కిల్స్ మాత్రం ప్రీమియర్ షో కు రెడీ అవుతన్నాయి. 

అలాగే ఓవర్ సీస్ లో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయ‌ని , వీటికి భారీగా క్రేజ్ నెల‌కొంద‌ని సమాచారం. మరో ప్రక్క సాహో పారిస్ లోని ప్రఖ్యాత గ్రాండ్ రిక్సె లో కూడా  స్పెషల్ షో కూడా ఉంది. అయితే ఆ డేట్ మాత్రం ఇంకా బ‌య‌ట‌కు రాలేదు. ప్రస్తుతం యూనిట్ ప్రమోషన్ ప‌నుల్లో బిజీగా ఉంది.  

ప్రభాస్‌ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు రన్‌ రాజా రన్‌ ఫేం సుజిత్‌ దర్శకుడు. యూవీ క్రియేషన్స్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో నీల్‌ నితిన్‌ ముఖేష్‌, మందిరా బేడీ, జాకీ ష్రాఫ్‌, చుంకీ పాండే, అరుణ్‌ విజయ్‌లు కీలక పాత్రల్లో నటించారు.