Asianet News TeluguAsianet News Telugu

సామాన్యుడు చేస్తే దొంగతనం, మీరు చేస్తే ఒప్పా: కోడెలపై మంత్రి కన్నబాబు ఫైర్

అసెంబ్లీలో భద్రత లేని కారణంగానే ఇంటికి తీసుకెళ్లానని కోడెల చెప్పడం విడ్డూరంగా ఉందంటూ విమర్శించారు. అసెంబ్లీలో లేని భద్రత ఆయన ఇంట్లో ఉంటుందా అంటూ నిలదీశారు. ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా అంటూ ప్రశ్నించారు. 
 

ap minister kurasala kannababu fires on ex assembly kodela sivaprasadarao
Author
Amaravathi, First Published Aug 20, 2019, 4:54 PM IST

అమరావతి: ఏపీ మాజీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు మంత్రి కురసాల కన్నబాబు. కోడెల శివప్రసాదరావు అసెంబ్లీలోని ఫర్నీచర్ ని తన ఇంటికి తీసుకెళ్లడం దారుణమని విమర్శించారు. 

అసెంబ్లీ ఫర్నీచర్ మాయమైన ఘటనపై విచారణ జరుగుతుందని అందులో భాగంగా కోడెల శివప్రసాదరావు ఆ ఫర్నీచర్ తానే తీసుకెళ్లాలనని తిరిగి ఇచ్చేస్తానని అంటున్నారని ఒకవేళ విచారణ లేకపోతే దాని ఊసే ఉండేది కాదన్నారు.  

అసెంబ్లీలో భద్రత లేని కారణంగానే ఇంటికి తీసుకెళ్లానని కోడెల చెప్పడం విడ్డూరంగా ఉందంటూ విమర్శించారు. అసెంబ్లీలో లేని భద్రత ఆయన ఇంట్లో ఉంటుందా అంటూ నిలదీశారు. ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా అంటూ ప్రశ్నించారు. 

విచారణలో కోడెల శివప్రసాదరావు తప్పు చేశానని ఒప్పుకుంటే, ఆ తప్పు ఒప్పు అవుతుందా అని కన్నబాబు నిలదీశారు. ఇదే పనిని ఒక సామాన్యుడు చేస్తే  దొంగతనమో, చేతివాటమనో అనేవారని ఎద్దేవా చేశారు. ఫర్నీచర్‌ను ఇంటికి తీసుకెళ్లడంపై కోడెలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

మరోవైపు వరదల కారణంగా పంటలు నష్టపోయిన చోట మళ్లీ పంటలు వేసుకునేలా ప్రోత్సాహిస్తామని రైతులకు మంత్రి కన్నబాబు హామీ ఇచ్చారు. పంటలు పోయిన రైతులకు వంద శాతం సబ్బిడీపై విత్తనాలు ఇవ్వాలని కోరుతున్నారని, దానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. 

మినుములు, పెసల విత్తనాలు కూడా సబ్బిడీపై ఇస్తామని హామీ ఇచ్చారు. రాయలసీమకు కృష్ణ నీటిని తరలించామని, కళ్లకు కనిపిస్తున్నా దేవినేని ఉమ, మిగతా టీడీపీ నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 

రాజకీయం కోసమే విమర్శలు చేస్తున్నారని, వరదపై బురద రాజకీయాలు చేశారని కన్నబాబు మండిపడ్డారు. డ్రోన్‌ కోసం నానా రాద్దాంతం చేస్తున్నారని, అసలు ఈ రాష్ట్రంలో డ్రోన్‌ కార్పోరేషన్‌ ఏర్పాటు చేసింది బాబు కాదా? అని ప్రశ్నించారు. 

గతంలో గోదావరి పుష్కరాల్లో డ్రోన్‌ వాడలేదా..?, ప్రభుత్వం వరద వలన ఎవ్వరికి నష్టం లేకుండా చర్యలు తీసుకునేందుకు డ్రోన్ వినియోగించామని అందులో తప్పేముందని మంత్రి కురసాల కన్నబాబు నిలదీశారు. 

ఈ వార్తలు కూడా చదవండి

అసెంబ్లీ ఫర్నిచర్ నేనే వాడుకున్నా..డబ్బులు కట్టేస్తా: కోడెల

అసెంబ్లీ ఫర్నిచర్ మాయం: కోడెల మెడకు మరో ఉచ్చు..?

Follow Us:
Download App:
  • android
  • ios