ఎపిలో బిజెపి ప్లాన్: నేటి వార్తలు మరిన్ని

By rajesh yFirst Published Jul 27, 2019, 6:01 PM IST
Highlights

 

నేటి ముఖ్యమైన వార్తలను మీరు మిస్సయ్యారా... అలా మిస్ కాకూడదంటే ఈ కింది వార్తలను సంక్షిప్తంగానే కాకుండా వివరంగా కూడా చదవడానికి వీలుగా అందిస్తున్నాం.

ఎపిలో బిజెపి ప్లాన్: చంద్రబాబు కార్నర్, వైఎస్ జగన్ టార్గెట్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తరించడానికి బిజెపి నాయకత్వం పక్కా ప్లాన్ రచించి అమలు చేస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి వైఎస్సార్ కాంగ్రెసు పార్టీకి తామే ప్రత్యామ్నాయంగా మారడానికి ప్రణాళికను రచించి అమలు చేస్తోంది. బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ కు ఆ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.

 

తనయుడు మోక్షజ్ఞ కోసం బాలకృష్ణ ప్రత్యేక పూజలు: ఎందుకంటే....

ఇకపోతే బాలకృష్ణ ఈ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం ఇదే మెుదటి సారి కాదు. గతంలో చాలా సార్లు బాలకృష్ణ ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు సినిమాలు విజయవంతమైనప్పుడు, ప్రారంభోత్సవాలకు కూడా బాలయ్య ఈ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీ.  

 

సీఎం జగన్ వద్దన్నా వినలేదు: చిక్కుల్లో పడ్డ మంత్రి, క్షమాపణలు చెప్పిన జయరాం

సీఎం వైయస్ జగన్ క్రైస్తవులకు జీసస్ అని, ముస్లింలకు అల్లా అని, దళితులకు అంబేడ్కర్ అంటూ పొగడ్తలతో సభలో ఊదరగొట్టారు. వైయస్ జగన్ ముస్లింలకు అల్లా అంటూ చేసిన వ్యాఖ్యలపై కొందరు ముస్లిం సోదరులు అభ్యంతరం వ్యక్తం చేశారు. 
 

 

మళ్లీ మొదలుపెట్టిన కేశినేని, పీవీపీ ట్వీట్ వార్

 విజయవాడలో కేశినేని ట్రావెల్స్ కి చెందిన మాజీ ఉద్యోగులు చేసిన ధర్నాకు సీసీఐ నేతలు మద్దతు పలికిన విషయం తెలిసిందే. మూడేళ్లుగా తమకు జీతాలు ఇవ్వడం లేదని మాజీ  ఉద్యోగులు ధర్నా చేయగా.. కమ్యూనిస్టు నేతలు వారితోపాటు ఆందోళన చేశారు. ఈ ధర్నాపై కేశినేని సోషల్ మీడియాలో స్పందించారు.

 

నా తమ్ముడిలాంటి వ్యక్తి సమాజానికి ప్రమాదం, ఎన్ కౌంటర్ చేయండి: కిడ్నాపర్ రవిశంకర్ సోదరుడు

విజయవాడలో జైలు నుంచి కోర్టుకు తరలిస్తుండగా ఎస్కార్ట్‌ సిబ్బంది కళ్లుగప్పి తప్పించుకొని పారిపోయాడు. రెండు నెలల నుంచి పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నాడు రవి శంకర్. ఆటో మొబైల్‌ దొంగతనాలు, చీటింగ్‌, ఉద్యోగాల పేరుతో ప్రజలను మోసం చేయడంలో రవిశంకర్ సిద్ధహస్తుడు.

 

పవన్ కల్యాణ్ కమిటీల్లో నో చాన్స్: జనసేనకు మాజీ జెడీ లక్ష్మినారాయణ గుడ్ బై?

విశాఖపట్నం: సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ జనసేనను వీడే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. జనసేన అభ్యర్థిగా సిబిఐ మాజీ జెడీ లక్ష్మినారాయణ విశాఖపట్నం లోకసభ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన జనసేనకు కాస్తా దూరంగానే ఉన్నట్లు తెలుస్తోంది

 

నా కొడుకును చంపేయండి, వాడు చావాలి: కిడ్నాపర్ రవిశంకర్ తల్లి ఆవేదన

తన కొడుకు కిడ్నాప్ చేసిన యువతి క్షేమంగా తిరిగి రావాలని తాను భగవంతుడిని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇంతటి దారుణానికి  పాల్పడ్డ తన కుమారుడు రవిశంకర్ ను  పట్టుకుని చంపేయండి అంటూ మీడియాకు స్పష్టం చేసింది. తన కుమారుడు పరమ దుర్మార్గుడు అంటూ చెప్పుకొచ్చారు. వాడు చావాలి బతికే అర్హత వాడికి లేదంటూ స్పష్టం చేశారు. 

 

మాజీ మంత్రి గంటాకు షాక్: ప్రత్యూష ఒప్పందం రద్దు

జిల్లా గ్రంథాలయానికి చెందిన ఆ స్థలాన్ని ప్రత్యూషకు లీజుకు ఇస్తూ చేసుకున్న ఒప్పందం ఐదేళ్ల క్రితమే రద్దయిందని బిఎల్ నారాయణ చెప్పారు. అయినప్పటికీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మాత్రం ఇప్పటికీ ప్రత్యూష కంపెనీ పేర ఎన్ కంబ్రెన్ష్ కొనసాగుతోందని చెప్పారు.

 

మోదీ సపోర్టుతోనే గెలిచాడు, పిచ్చోడిచేతిలో రాయిలా ఏపీ పాలన : జగన్ పై టీడీపీ నేత కోట్ల సంచలన వ్యాఖ్యలు

అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ గెలవడానికి కారణం ప్రధాని నరేంద్ర మోదీయేనని చెప్పుకొచ్చారు. మోదీ సపోర్టుతోనే జగన్ గెలవగలిగారని స్పష్టం చేశారు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి. ఎన్నికల్లో ట్యాంపరింగ్ జరిగిందని దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుందంటూ చెప్పుకొచ్చారు. మోసాలతో గెలిచిన పార్టీలు ఎక్కువ కాలం ఉండవంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  

 

అక్బరుద్దీన్ ఓవైసీకి ఐపీఎస్ అధికారి క్లీన్ చిట్

అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు బాస సత్యనారాయణ సీపీకి ఫిర్యాదు చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు అక్బరుద్దీన్ ప్రసంగించిన వీడియోను అనువాద నిపుణులకు పంపించారు.   

 

కేసీఆర్ కేబినెట్ విస్తరణ: హరీష్ రావుకు చోటు, లెక్కలు ఇవీ...

ఆగస్టు మొదటి వారంలో తెలంగాణ మంత్రి వర్గాన్ని విస్తరించేందుకు గులాబీ బాస్ కసరత్తు చేస్తున్నారని ఎవరెవరికి అవకాశాలు ఇవ్వాలో కూడా ఇప్పటికే డిసైడ్ అయినట్లు సమాచారం. మంత్రి వర్గంలో నలుగురికి స్థానం కల్పించనున్నట్లు తెలుస్తోంది. 

 

హైదరాబాద్ మెట్రోకుతప్పిన ప్రమాదం: 400 మంది ప్రయాణికులు సేఫ్

హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలుకు పెను ప్రమాదం తప్పింది. ఒక ట్రాక్ లో వెళ్లాల్సిన మెట్రో రైలు మరో ట్రాక్ లోకి వచ్చేసింది. దాంతో వెంటనే తేరుకున్న సిబ్బంది మార్గమధ్యలో ప్రయాణికులను దించేసి వెనక్కి వెళ్లిపోయింది. 

 

కవిత ఓటమికి కారణం ఎవరో చెప్పిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి: అంతా కేసీఆర్ చేతుల్లోనే..

 ఇకపోతే సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్ టీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థిగా మరోసారి పోటీ చేశారు కల్వకుంట్ల కవిత. రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ కుమారుడు ధర్మపురి అరవింద్ బీజేపీ తరపున బరిలోకి దిగారు. ఈ ఎన్నికల్లో ధర్మపురి అరవింద్ కవితపై 68వేల ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు.   

 

తెలంగాణలో అమిత్ షా సభ్యత్వం.. ఏంటి మ్యాటర్?

రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీని బలోపేతం చేయాలని ఆ పార్టీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో బీజేపీ అధికారం దక్కించుకోవడమే అమిత్ షా లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. 

 

అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై విజయశాంతి ఫైర్: కేసీఆర్ స్పందించాలని డిమాండ్

అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలోని ప్రశాంత పరిస్థితులను కాపాడవలసిన బాధ్యత దృష్ట్యా కేసీఆర్ స్పందించి ఇలాంటి వ్యాఖ్యలకు ఫుల్ స్టాప్ పెట్టించాలని విజయశాంతి డిమాండ్ చేశారు. 
 

కొందరు కావాలని చేస్తున్నారు... చట్టాన్ని ఉల్లంఘించలేదన్న అక్బరుద్దీన్

కరీంనగర్‌లో తాను చేసిన వ్యాఖ్యలను కొందరు తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు ఎంఐఎం అగ్రనేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ. తన ప్రసంగంలో ఎటువంటి అభ్యంతరకరమైన లేదా చట్టవిరుద్ధమైన ప్రకటన ఇవ్వలేదని..తన వ్యాఖ్యలు ఏ వర్గాన్ని కించపరచలేదన్నారు.

 

బీహార్‌లో వింత: పొలంలో పెద్ద గొయ్యి...ఆందోళనపడ్డ రైతులు

బిహార్‌లో పొలం పనులు చేసుకుంటున్న రైతుల మధ్య ఆకాశంలోంచి ఉల్క జారిపడింది. మధుబని జిల్లాలో రైతులంతా కలిసి పనిచేసుకుంటుండగా.. ఆకస్మాత్తుగా ఆకాశంలోంచి పెద్ధశబ్ధంతో బండరాయి మాదిరిగా ఉన్న ఒక పదార్ధం పెద్దగా శబ్ధం చేస్తూ పొలంలో పడింది.

 

పబ్లిక్ సర్వీస్ పరీక్షలో.. ఫస్ట్, సెకండ్ ర్యాంకులు సాధించిన భార్యాభర్తలు

ఛత్తీస్‌గఢ్‌లో భార్యాభర్తలు ఒకటి, రెండు స్థానాలు సాధించి అన్యోన్యతకు చిరునామాగా మారారు. వివరాల్లోకి వెళితే.. బిలాస్‌పూర్‌కు చెందిన అనుభవ్‌సింగ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు ఎంపికవ్వడమే లక్ష్యంగా పెట్టుకుని ఎంతో శ్రమించారు.

 

వరదలో చిక్కుకున్న మహాలక్ష్మీ ఎక్స్‌ప్రెస్, రైల్లో 2000 మంది

దేశ వాణిజ్య రాజధాని ముంబైని మరోసారి భారీ వర్షాలు వణికిస్తున్నాయి. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల ధాటికి రవాణా వ్యవస్థకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. రైల్వే ట్రాక్‌పై భారీగా వరద నీరు ప్రవహించడంతో ముంబై-కొల్హాపూర్‌ల మధ్య నడిచే మహాలక్ష్మీ ఎక్స్‌ప్రెస్ రైలు బద్లాపూర్-వాంగనీ మధ్య వరద నీటిలో చిక్కుకుపోయింది.

 

యడియూరప్ప ప్రభుత్వంలోకి కుమారస్వామి..?

కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వాన్ని కూలదోసినా..  ముఖ్యమంత్రిగా యడియూరప్ప ప్రమాణ స్వీకారం చేసినా బీజేపీ శ్రేణుల్లో ఆ ఆనందం మాత్రం లేదు.  ఎందుకంటే యడ్డీ సర్కార్ బలపరీక్షను ఎదుర్కోవాల్సి ఉంది.

 

రైతు విందు భోజనం.. అతన్ని కోటీశ్వరుడిని చేసింది!

భోజనానికి వచ్చిన అతిథులు చదివించిన చదివింపులతో ఆ రైతు కోటీశ్వరుడు అయ్యాడు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రం పుదుక్కోట జిల్లా కీరామంగళం తాలుకాలో చోటుచేసుకుంది.

 

దుబాయిలో ఉద్యోగం... ఇండియాలో నలుగురు భార్యలు

 ఒకరికి తెలీకుండా మరోకరిని పదేళ్లలో నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు. దుబాయిలో ఉద్యోగం చేస్తూ... భారీగా సంపాదిస్తూ.. నలుగురు భార్యలను ఇండియాలోనే ఉంచడం విశేషం. తీరా మొదటి భార్య వచ్చిన అనుమానంతో అతని మిగితా ముగ్గురు భార్యల వ్యవహారం కూడా బయటపడింది.

 

మహేష్ బాబు డిమాండ్స్.. విసిగిపోయిన దిల్ రాజు..?

రీసెంట్ గా 'మహర్షి' సినిమాతో సక్సెస్ అందుకున్నాడు మహేష్. ఈ సినిమాకి వంద కోట్ల షేర్ వచ్చినా కానీ నిర్మాతలకు పెద్దగా మిగిలిందేమీ లేదని తెలుస్తోంది. మహేష్ బాబు రెమ్యునరేషన్, దర్శకుడు వంశీ పైడిపల్లి చెప్పిన బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చుపెట్టడంతో.. నిర్మాతలు పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తే చాలని అనుకునే పరిస్థితి ఏర్పడింది. 

 

గ్యాంగ్‌స్టర్‌ సినిమాకి 'వాల్మీకి' టైటిలా..? బీసీ సంఘాల ఫైర్!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ 'వాల్మీకి' సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుండి ఓ వివాదం సినిమాను వెంటాడుతూనే ఉంది. గ్యాంగ్‌స్టర్‌ సినిమాకి 'వాల్మీకి' అనే టైటిల్ ఎలా పెడతారంటూ బీసీ సంక్షేమ సంఘాలు గొడవకి దిగుతున్నాయి. 

 

మహేష్ బాబు కొత్త వ్యాపారం.. మొన్నేమో మల్టీప్లెక్స్, నేడు..!

స్టార్ హీరో మహేష్ బాబు ఇటీవల గచ్చిబౌలిలో విలాసవంతమైన 'ఏఎంబీ' సినిమాస్ పేరుతో ఓ మల్టీప్లెక్స్ ని మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మరో వ్యాపారంలోకి అడుగుపెడుతున్నాడు. 

 

ఫిల్మ్ చాంబర్ ఎన్నికలు.. వాగ్వాదానికి దిగిన నిర్మాతలు!

ఫిల్మ్ చాంబర్ ఎన్నికల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉదయం ఎనిమిది గంటలకు మొదలైన పోలింగ్ ప్రక్రియ మధ్యాహ్నం ఒంటిగంటకు పూర్తయింది. దాదాపు 1438 మంది సభ్యులు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఓటింగ్ జరుగుతుండగా.. ఒకానొక దశలో పరిస్థితులు నిర్మాతల మధ్య గొడవకి దారి తీశాయి. 

 

డైరెక్టర్ తో విజయ్ దేవరకొండకి ఇష్యూ.. సినిమాను మధ్యలోనే..!

స్క్రిప్ట్ విషయంలో విజయ్ కి డైరెక్టర్ తో అభిప్రాయబేధాలు రావడంతో షూటింగ్ ఆపేసినట్లు ప్రచారం జరుగుతోంది. విజయ్ దేవరకొండ స్క్రిప్ట్ లో ఇన్వాల్వ్ అవ్వడం, సలహాలు ఇవ్వడం దర్శకుడు ఆనంద్ కి నచ్చలేదని చెబుతున్నారు. 

 

అప్పట్లో బాలయ్యకి నో చెప్పిన భూమిక, ఇప్పుడు తప్పలేదు!

భూమిక ఫామ్ లో ఉన్న రోజుల్లోనే ఆమెను బాలయ్య సరసన నటింపచేయాలని ప్రయత్నాలు జరిగాయి. అయితే ఎందుకునో అవి ముందుకు వెళ్లలేదు. భూమిక ఇంట్రస్ట్ చూపించలేదని చెప్తారు. అయితే ఇంతకాలానికి బాలయ్య సినిమాలో ఆమె కనపించబోతోందని సమాచారం. 

 

ఆ పత్రికలో వచ్చిన వార్త‌పై బ‌న్నీ సీరియ‌స్‌!

ప్రముఖ దర్శకుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న సినిమాపై మీడియాలో గత కొంతకాలంగా దుష్ప్ర‌చారం జ‌రుగుతోంది. ఎవరు చేస్తున్నారో...ఎందుకు చేస్తున్నారో తెలియకుండా వార్తలు స్ప్రెడ్ అవుతున్నాయి.

 

గ్యాంగ్‌స్టర్‌ సినిమాకి 'వాల్మీకి' టైటిలా..? బీసీ సంఘాల ఫైర్!

'వాల్మీకి' టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుండి ఓ వివాదం సినిమాను వెంటాడుతూనే ఉంది.గ్యాంగ్‌స్టర్‌ సినిమాకి 'వాల్మీకి' అనే టైటిల్ ఎలా పెడతారంటూ బీసీ సంక్షేమ సంఘాలు గొడవకి దిగుతున్నాయి. 

click me!