ఓ వ్యక్తి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు పెళ్లిళ్లు  చేసుకున్నాడు. ఒకరికి తెలీకుండా మరోకరిని పదేళ్లలో నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు. దుబాయిలో ఉద్యోగం చేస్తూ... భారీగా సంపాదిస్తూ.. నలుగురు భార్యలను ఇండియాలోనే ఉంచడం విశేషం. తీరా మొదటి భార్య వచ్చిన అనుమానంతో అతని మిగితా ముగ్గురు భార్యల వ్యవహారం కూడా బయటపడింది. ఈ  సంఘటన చెన్నైలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... రామనాథపురానికి చెందిన కోమలాదేవి అనే మహిళకు 2008లో గంగనాథన్ అనే వ్యక్తితో వివాహమైంది. గంగనాథన్ కి దుబాయిలో ఉద్యోగం. దీంతో కోమలాదేవిని పెళ్లి చేసుకొని ఆమెను దుబాయి తీసుకువెళ్లాడు. కొంత కాలం తర్వాత ఆమెను ఇండియాకు తీసుకువచ్చేశాడు. వీరికి ప్రస్తుతం 9 సంవత్సరాల వయసుగల ఒక కొడుకు, కూ తురు ఉన్నారు.

అప్పటి నుంచి గంగనాథన్ మాత్రం దుబాయిలో ఉంటూ... అప్పుడప్పుడూ ఇండియాకు వచ్చేవాడు. ఇటీవల కోమలాదేవికి భర్త ప్రవర్తనపై అనుమానం కలిగింది. అతని ఫోన్ పరిశీలించగా... తనను కాకుండా మరో ముగ్గురు అమ్మాయిలను పెళ్లి చేసుకున్నట్లు గుర్తించింది. వారితో దిగిన ఫోటోలు, వీడియోలు చూసి కోమలాదేవి షాకయ్యింది. 

ఒక్కో భార్యతో వేర్వేరు విలాసాలు, రేషన్‌కార్డులు, ప్రభుత్వ నకిలీ డాక్యుమెంట్లు పొందాడు. అన్ని మోసాలను తెలుసుకున్న కోమలాదేవి భర్తపై రామనాథపురం మహిళా పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఫిర్యాదు చేసింది. గంగనాథన్, కోమలాదేవీ దంపతులకు 10, 9 ఏళ్ల వయసున్న కుమారుడు, కుమార్తె ఉన్నారు. రెండోభార్య కవితకు శ్రీధరన్, మూడోభార్య యమునకు గిరిధరన్, నాల్గో భార్య దీపకు ఒక కుమార్తె ఉండడం గమనార్హం. తనలా మోసపోయిన మిగితా ముగ్గురు మహిళలకు కూడా కోమలాదేవి సమాచారం అందజేయడం విశేషం.