Asianet News TeluguAsianet News Telugu

గ్యాంగ్‌స్టర్‌ సినిమాకి 'వాల్మీకి' టైటిలా..? బీసీ సంఘాల ఫైర్!

'వాల్మీకి' టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుండి ఓ వివాదం సినిమాను వెంటాడుతూనే ఉంది.గ్యాంగ్‌స్టర్‌ సినిమాకి 'వాల్మీకి' అనే టైటిల్ ఎలా పెడతారంటూ బీసీ సంక్షేమ సంఘాలు గొడవకి దిగుతున్నాయి. 

valmiki movie title controversy
Author
Hyderabad, First Published Jul 27, 2019, 10:19 AM IST

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ 'వాల్మీకి' సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుండి ఓ వివాదం సినిమాను వెంటాడుతూనే ఉంది. గ్యాంగ్‌స్టర్‌ సినిమాకి 'వాల్మీకి' అనే టైటిల్ ఎలా పెడతారంటూ బీసీ సంక్షేమ సంఘాలు గొడవకి దిగుతున్నాయి. వాల్మీకి సినిమా పేరును వెంటనే మార్చాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు.

లేకపోతే బోయ హక్కుల పోరాట సమితి చేసే పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన తెలిపారు. బోయహక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో శుక్రవారం ఇందిరాపార్కు వద్ద వాల్మీకి సినిమా టైటిల్ మార్చాలంటూ వాల్మీకి బోయలు మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు ఆర్‌.కృష్ణయ్య, బీసీ కులాల ఐక్యవేదిక జేఏసీ కన్వీనర్ కుందారం గణేష్ చారి, బీసీ సంక్షేమ సంఘంజాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జకృష్ణ, రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ హాజరై తమ మద్దతు ప్రకటించారు.

ఈ సందర్భంగా... ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. వాల్మీకి సినిమా తీస్తే ఆధ్యాత్మిక ఉట్టిపడేలా ఉండాలని.. కానీ గ్యాంగ్‌స్టర్‌ సినిమాకు టైటిల్ పెట్టడం దుర్మార్గం అన్నారు. ఆరు నెలలుగా ఈ సినిమా పేరును మార్చాలని సినిమా మేకర్స్‌నుకోరినా వారు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. 'వాల్మీకి' టైటిల్ వెంటనే మార్చకపోతే సినిమా యూనిట్ పై కేసులు పెట్టి.. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

మరి ఈ వివాదంపై చిత్రబృందం ఎలా స్పందిస్తుందో చూడాలి.. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని సెప్టంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios