బిహార్‌లో పొలం పనులు చేసుకుంటున్న రైతుల మధ్య ఆకాశంలోంచి ఉల్క జారిపడింది. మధుబని జిల్లాలో రైతులంతా కలిసి పనిచేసుకుంటుండగా.. ఆకస్మాత్తుగా ఆకాశంలోంచి పెద్ధశబ్ధంతో బండరాయి మాదిరిగా ఉన్న ఒక పదార్ధం పెద్దగా శబ్ధం చేస్తూ పొలంలో పడింది.

దగ్గరికి వెళ్లి చూడగా... నాలుగు అడుగుల లోతులో గొయ్యి పడింది. గ్రామస్తుల సాయంతో దానిని బయటకి తీసిన రైతులు ఆ రాయికి ఆకర్షణ శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. దాని బరువు 33 పౌండ్లు ఉన్నట్లు గుర్తించారు.

అనంతరం ఈ రాయిని అధికారులకు అందజేయగా.. వారు ఈ ఉల్కని పట్నాలోని మ్యూజియానికి తరలించారు. అక్కడ దానిని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పరిశీలించారు.