హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలుకు పెను ప్రమాదం తప్పింది. ఒక ట్రాక్ లో వెళ్లాల్సిన మెట్రో రైలు మరో ట్రాక్ లోకి వచ్చేసింది. దాంతో వెంటనే తేరుకున్న సిబ్బంది మార్గమధ్యలో ప్రయాణికులను దించేసి వెనక్కి వెళ్లిపోయింది. 

వివరాల్లోకి వెళ్తే మియాపూర్-ఎల్బీ నగర్ రూట్ లో వెళ్లాల్సిన మెట్రో రైలు వేరే ట్రాక్ లో వెళ్లిపోయింది. జరిగిన పొరపాటును తెలుసుకున్న రైలు సిబ్బంది లక్డీకపూల్ లో ప్రయాణికులను దించి వెనక్కి వెళ్లిపోయింది మెట్రో. దీంతో నాలుగు వందల మంది ప్రయాణికులు హమ్మయా అంటూ ఊపిరి పీల్చుకున్నారు. మెట్రో రైలు ట్రాక్ మారిపోవడంతో మెట్రో రైలు సేవలను అధికారులు నిలిపివేశారు.