విజయవాడ: మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్, కిడ్నాపర్ రవిశంఖర్ ను పట్టుకుని చంపేయండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు రవిశంకర్ తల్లి. హయత్‌నగర్‌లో ఓబీఫార్మసీ యువతిని కిడ్నాప్ చేసిన విషయం తెలుసుకుని ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.  

తన కొడుకు కిడ్నాప్ చేసిన యువతి క్షేమంగా తిరిగి రావాలని తాను భగవంతుడిని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇంతటి దారుణానికి  పాల్పడ్డ తన కుమారుడు రవిశంకర్ ను  పట్టుకుని చంపేయండి అంటూ మీడియాకు స్పష్టం చేసింది. 

తన కుమారుడు పరమ దుర్మార్గుడు అంటూ చెప్పుకొచ్చారు. వాడు చావాలి బతికే అర్హత వాడికి లేదంటూ స్పష్టం చేశారు. రవిశంకర్ చిన్నప్పటి నుంచి తప్పుడు పనులు చేస్తున్నాడు అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.  

తన ఇంటికి వచ్చి దాదాపు ఏడేళ్లు అయ్యిందని ఆమె చెప్పుకొచ్చారు. కుటుంబ సభ్యులను కూడా పట్టించుకునే వాడు కాదని తెలిపారు. అలాంటి దుర్మార్గుడు బతికి ఉంటే సమాజానికి మరింత ప్రమాదం అని ఆమె స్పష్టం చేసింది. 

ఈ వార్తలు కూడా చదవండి

నా తమ్ముడిలాంటి వ్యక్తి సమాజానికి ప్రమాదం, ఎన్ కౌంటర్ చేయండి: కిడ్నాపర్ రవిశంకర్ సోదరుడు