టాలీవుడ్ లో  స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన భూమిక పెళ్లైన తర్వాత సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత గ్యాప్ తీసుకుని తల్లి, అక్క పాత్రలతో టాలీవుడ్ లో మళ్లీ సీన్ లోకి వచ్చింది.  నాని సరసన `ఎంసీఏ` చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన భూమిక సమంత - యూటర్న్.. నాగచైతన్య- సవ్యసాచి చిత్రాల్లోనూ నటించారు. అయితే ఆ తర్వాత వచ్చిన ఆఫర్స్ ఏమీ కమిటవ్వలేదు. తాజాగా  కొంత గ్యాప్ తర్వాత తెలుగులో మరో భారీ చిత్రానికి భూమిక సైన్ చేసింది.  

నటసింహా నందమూరి బాలకృష్ణ  హీరోగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం లో ఓ కీలక పాత్రను పోషిస్తోంది. ఇప్పటికే .... ఈ చిత్రంలో అందాల భామలు సోనాల్ చౌహాన్- వేదిక హీరోయిన్స్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. భూమిక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లోని కీలక పాత్రకు ఎంపికయ్యారని తెలుస్తోంది. బాలకృష్ణ -భూమికల పై ఉండే సన్నివేశాలను కోనసీమలో చిత్రీకరించనున్నారని వినికిడి. కథను మలుపు తిప్పే పాత్ర ఆమెదని, అందుకే ఓకే చేసిందని చెప్తున్నారు. 

భూమిక ఫామ్ లో ఉన్న రోజుల్లోనే ఆమెను బాలయ్య సరసన నటింపచేయాలని ప్రయత్నాలు జరిగాయి. అయితే ఎందుకునో అవి ముందుకు వెళ్లలేదు. భూమిక ఇంట్రస్ట్ చూపించలేదని చెప్తారు. అయితే ఇంతకాలానికి బాలయ్య సినిమాలో ఆమె కనపించబోతోందన్నమాట.

గతేడాది బాలయ్య, కెఎస్ రవికుమార్ కలిసి 'జైసింహ' చేశారు.  ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది.  రవికుమార్ స్టైల్ నచ్చిన బాలయ్య ఆయనతో ఇంకోసారి పనిచేసేందుకు ఒప్పుకున్నారు.  ఈ చిత్రాన్ని సి.కళ్యాణ్ నిర్మించనున్నారు.  ఎస్.ఎస్.థమన్ సంగీతం అందించనున్నారు. సి.కళ్యాణ్ నిర్మిస్తున్నారు. ఆగస్టు 7న సినిమాని ప్రారంభించి అటుపై బ్యాంకాక్ లో రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభిస్తున్నారు.  2020 సమ్మర్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలన్నది ప్లాన్ . మరో ప్రక్క భూమిక తిరిగి టాలీవుడ్ లో బిజీ అయ్యే ప్రయత్నాల్లో ఉందని తెలుస్తోంది.