హైదరాబాద్: ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా అక్బరుద్దీన్ వ్యాఖ్యలు చేశారంటూ ఆమె ఆరోపించారు.

నిమిషాల సమయం ఇస్తే ,హిందు ,ముస్లింల సంఖ్య సమానం చేస్తానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు మత విద్వేషాలు రెచ్చగొట్టమేనని ఆమె అభిప్రాయపడ్డారు. అక్బరుద్దీన్ వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజల మధ్య చిచ్చుపెట్టేలా ఉన్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. 

అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలోని ప్రశాంత పరిస్థితులను కాపాడవలసిన బాధ్యత దృష్ట్యా కేసీఆర్ స్పందించి ఇలాంటి వ్యాఖ్యలకు ఫుల్ స్టాప్ పెట్టించాలని విజయశాంతి డిమాండ్ చేశారు.