పవన్ కల్యాణ్ కమిటీల్లో నో చాన్స్: జనసేనకు మాజీ జెడీ లక్ష్మినారాయణ గుడ్ బై?

First Published 27, Jul 2019, 3:51 PM

విశాఖపట్నం: సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ జనసేనను వీడే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. జనసేన అభ్యర్థిగా సిబిఐ మాజీ జెడీ లక్ష్మినారాయణ విశాఖపట్నం లోకసభ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన జనసేనకు కాస్తా దూరంగానే ఉన్నట్లు తెలుస్తోంది

విశాఖపట్నం: సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ జనసేనను వీడే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. జనసేన అభ్యర్థిగా సిబిఐ మాజీ జెడీ లక్ష్మినారాయణ విశాఖపట్నం లోకసభ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన జనసేనకు కాస్తా దూరంగానే ఉన్నట్లు తెలుస్తోంది.

వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు దర్యాప్తు ద్వారా లక్ష్మినారాయణ హీరో అయ్యాడు. ఆయనకు గ్లామర్ పెరిగింది కూడా ఆ కేసులతోనే. ఆ తర్వాత ఆయన మహారాష్ట్రకు బదిలీ అయ్యారు. తన పదవికి రాజీనామా చేసి ఆయన నిరుడు రాజకీయాల్లోకి వచ్చారు.  ఆయన సొంత పార్టీ పెడుతారని, లోకసత్తాకు నాయకత్వం వహిస్తారని అప్పట్లో ప్రచారం సాగింది

ఆ తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలో చేరుతారనే ప్రచారం కూడా సాగింది. కానీ, చివరికి అనూహ్యంగా పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. విశాఖపట్నం లోకసభ స్థానానికి పోటీ చేసిన లక్ష్మినారాయణ మాత్రమే కాకుండా ఆ లోకసభ నియోజకవర్గం పరిధిలోని గాజువాక శాసనసభ స్థానానికి పోటీ చేసిన పవన్ కల్యాణ్ కూడా ఓటమి పాలయ్యారు

ఓటమి తర్వాత లక్ష్మినారాయణ పెద్దగా సందడి చేయలేదు. పవన్ కల్యాణ్ తో పాటు కనిపించలేదు. పార్టీ ఓటమిపై నిర్వహించిన సమీక్షా సమావేశాలకు కూడా హాజరు కాలేదు. దాంతో ఆయన జనసేనకు దూరమవుతారనే ప్రచారం ముమ్మరంగానే సాగింది. దానికి బలం చేకూరుస్తూ తాజా పరిణామం చోటు చేసుకుంది

పవన్ కల్యాణ్ తాజాగా ఏర్పాటు చేసిన పార్టీ పోలిట్ బ్యూరోలో లక్ష్మినారాయణకు చోటు దక్కలేదు. దీంతో జనసేనతో ఆయనకు పూర్తిగా సంబంధాలు తెగిపోయాయనే ప్రచారం సాగుతోంది. అత్యంత కీలకమైన లక్ష్మినారాయణను పోలిట్ బ్యూరోలో నియమించకపోవడం ఆ ప్రచారానికి ఊతం ఇస్తోంది. గతంలో లక్ష్మినారాయణను తమ పార్టీలో చేర్చుకునేందుకు బిజెపి నాయకులు పెద్గగానే ప్రయత్నాలు చేశారు

loader