ఫిరాయింపులపై బాబు సంచలనం: మరిన్ని వార్తలు

By Siva KodatiFirst Published Sep 6, 2019, 12:15 PM IST
Highlights

నేటి ముఖ్యమైన వార్తలను మీరు మిస్సయ్యారా... అలా మిస్ కాకూడదంటే ఈ కింది వార్తలను సంక్షిప్తంగానే కాకుండా వివరంగా కూడా చదవడానికి వీలుగా అందిస్తున్నాం.

కేసీఆర్ మహారాజునని ఊహించుకుంటున్నారు, దొరతనం ప్రమాదకరం: విజయశాంతి ఫైర్

దేవాలయాల్లో చిత్రాలు చెక్కించుకోవడం పట్ల కేసీఆర్ తనను తాను మహారాజుగా ఊహించుకుంటున్నారని అర్థమవుతోందని విమర్శించారు. రాజులు, రాజ్యాలు కనుమరుగైన తర్వాత కూడా కెసిఆర్‌ తన దొరతనాన్ని ప్రదర్శించాలనుకోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

దమ్ము, ధైర్యం ఉంటే మాట మీద నిలబడండి: చంద్రబాబుకు ఎమ్మెల్యే శ్రీదేవి సవాల్

చంద్రబాబు 40ఏళ్ల రాజకీయం మెుత్తం వెన్నుపోటు, దిగజారడు, చిల్లర రాజకీయాలేనని విమర్శించారు. తాను హిందూ మాదిగ సామాజికవర్గానికి చెందిన మహిళనని తన వద్ద ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. కులధృవీకరణ పత్రం కూడా ఉందని తెలిపారు. 

చంద్రయాన్-2: ఆ 15 నిమిషాలే కీలకమన్న ఇస్రో ఛైర్మెన్ శివన్

చంద్రయాన్-2 లో ఆఖరి ఘట్టం మొదలైంది. శనివారం నాడు ఉదయం తెల్లవారుజామున విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై దిగనుంది. ఈ ఘట్టం కోసం  ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.

 

యాదాద్రి శిల్పాలపై కేసీఆర్ బొమ్మలు

 

యాదగిరిగుట్ట (యాదాద్రి) ఆలయ అభివృద్ది పనుల్లో భాగంగా తెలంగాణ చరిత్రతో పాటు కేసీఆర్ చరిత్రను కూడ రాతి స్థంబాలపై చెక్కారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 

యూరియా కోసం అన్నదాత చనిపోవడం కలచివేసింది: పవన్ కళ్యాణ్

యూరియా కోసం క్యూలో గంటల తరబడి నిలబడి గుండెపోటుతో చనిపోయిన రైతు ఎల్లయ్య కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణం రైతాంగానికి అవసరమైన ఎరువులు యుద్ధ ప్రాతిపదికన అందుబాటులోకి తీసుకురావాలని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. 

అవసరాల కోసం పార్టీలో చేరి ఇప్పుడు వెళ్లిపోతున్నారు: వలస నేతలపై చంద్రబాబు

మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు పార్టీ మారతారంటూ తనకు ఎలాంటి సమాచారం లేదన్నారు. స్వలాభాల కోసం పార్టీ వీడుతూ తమపై నిందలు వేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపులకు రిజర్వేషన్లు ఇవ్వడమే తాను చేసిన తప్పు అంటూ  చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. 

చంద్రయాన్-2: ఆ 15 నిమిషాలే కీలకమన్న ఇస్రో ఛైర్మెన్ శివన్

 

చంద్రయాన్-2  శనివారం నాడు తెల్లవారుజామున ఉదయం 1:55 గంటలకు ల్యాండ్ కానుంది. ఈ మేరకు ఇస్రో సర్వం సిద్దం చేసింది. చంద్రయాన్-2  శనివారం నాడు తెల్లవారుజామున ఉదయం 1:55 గంటలకు ల్యాండ్ కానుంది. ఈ మేరకు ఇస్రో సర్వం సిద్దం చేసింది. 

 

ఆ షాంపూయే మా ఇద్దరిని కలిపింది: అనుష్కతో ప్రేమాయణం గురించి కోహ్లీ

విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ... పరిచయం అక్కర్లేనీ  సెలబ్రిటీ జంట. అయితే వీరిద్దరి సాగిన రొమాంటిక్ లవ్ స్టోరీ గురించి తెలుసుకోవాలని అభిమానులు ఆసక్తికనబరుస్తుంటారు. వారికోసమే కోహ్లీ స్వయంగా తన లవ్ స్టోరీ  ఎలా మొదలయ్యిందో బయటపెట్టాడు.  

 

ఆరు రోజుల పసికిందుని హ్యాండ్ బ్యాగులో కుక్కి...

 

ఆరు రోజుల పసికందుని ఓ మహిళ హ్యాండ్ బ్యాగులో కుక్కింది. అనంతరం ఆ బ్యాగును తీసుకొని విమానంలో వేరే దేశానికి చెక్కేయాలని ప్లాన్ చేసింది. కానీ చివరకు ఎయిర్ పోర్టు అధికారులకు చిక్కింది. ఈ సంఘటన పిలిఫ్పీన్స్‌లో బుధవారం ఉదయం చోటుచేసుకుంది

 

 

ఆస్తుల కేసులో జగన్ పిటిషన్‌పై 20న విచారణ

 ఆస్తుల కేసులో తనకు మినహాయింపు ఇవ్వాలని  కోరుతూ ఏపీ సీఎం జగన్ సీబీఐ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా పడింది.ఆస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఏపీ సీఎం వైఎస్ జగన్ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. 

 

కమీషన్లు దండుకునే బతుకు మీది: చంద్రబాబుపై విజయసాయిరెడ్డి ఫైర్

ఆర్టీసీని చంద్రబాబు మూసివేసే దశకు తీసుకెళ్తే జగన్ మాత్రం ఇచ్చిన మాట నిలుపుకొని ఊపిరి పోశారని స్పష్టం చేశారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించి కమీషన్లు దండుకునే బతుకు చంద్రబాబుదంటూ ధ్వజమెత్తారు. 

తెలంగాణలో యూరియా కష్టాలు: క్యూ లైన్లో స్పృహ కోల్పోయిన మహిళా రైతు

తెలంగాణ రైతన్నలను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. యూరియా కోసం క్యూలో నిలబడలేక ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి నెలకొంది. సిద్ధిపేట జిల్లా దుబ్బాక వ్యవసాయ మార్కెట్ వద్ద ఎల్లయ్య అనే రైతు మృతి చెందిన ఘటన మరువకముందే నిజామాబాద్ జిల్లాలో మరో ఘటన చోటు చేసుకుంది. 

 

 

షాక్... జగన్ పై ఎంపీ టీజీ వెంకటేష్ ప్రశంసల వర్షం

బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టీజీ వెంకటేష్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎప్పుడూలేనిది జగన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. న్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారని టీజీ వెంకటేష్ పేర్కొన్నారు.

 

వంద రోజుల పాలనకు వంద మార్కులు: జగన్‌పై జేసీ ప్రశంసలు

 ఏపీ సీఎం వైఎస్ జగన్ పై మాజీ ఎంపీ, టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి ప్రశంసలు కురిపించాడు. వంద రోజుల పాలనపై జగన్‌కు వంద మార్కులు పడాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు.

 

ఆమ్లా రికార్డును బ్రేక్ చేసిన మహిళా క్రికెటర్

వన్డే ఫార్మాట్‌లో వేగవంతంగా 13వ సెంచరీ సాధించిన క్రికెటర్‌గా మెగ్‌ లానింగ్‌ రికార్డు సృష్టించారు. మెగ్‌ లానింగ్‌ 76 ఇన్నింగ్స్‌ల్లోనే 13వ వన్డే సెంచరీ చేసీ రికార్డు సృష్టించారు. గతంలో దక్షిణాఫ్రికా క్రికెటర్‌ హషీమ్‌ ఆమ్లా 83 ఇన్నింగ్స్‌లో 13వ సెంచరీ మార్కును చేరి ఆ రికార్డును తన పేరిట లిఖించుకోగా, దాన్ని మెగ్‌ లానింగ్‌ బ్రేక్‌ చేశారు.

సోషల్ మీడియాలో వీడియో పెట్టి... ప్రేమ జంట ఆత్మహత్య

తమ చావుకి ఎవరూ కారణం కాదంటూ ఓ వీడియో తీసి... దానిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసి మరీ వారు ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ సంఘటన  పంజాబ్ లో చోటుచేసుకుంది.

ప్రియుడిని దక్కించుకోవడానికి.. పెళ్లి నాటకం ఆడి..

నిజంగానే ఆమె పెళ్లి అనుకొని అతను అక్కడికి వచ్చాడు. అతనిలానే చాలా మందిని ఆలేషా ఆహ్వానించింది. వారంతా పెళ్లికి వచ్చారు. ఆలేషా కూడా అచ్చం పెళ్లికూతురులా తెలుపు రంగు గౌను ధరించి అందంగా ముస్తాబయ్యింది. పెళ్లి కొడుకు మాత్రం కనపడటం లేదంటబ్బా అని అందరూ ఆకస్తిగా చూస్తున్న సమయంలో... ఆలేషా మైక్ అందుకొని పాట పాడింది. 

 

రైతులను అవమానపర్చాడు: మంత్రి నిరంజన్ రెడ్డిపై భట్టి ఫైర్

రైతులను అవమానపర్చే విధంగా వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడారని కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లుభట్టి విక్రమార్క చెప్పారు.  అవమానపర్చే విధంగా వ్యాఖ్యలు చేసిన నిరంజన్ రెడ్డి వెంటనే రైతులకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు

 

మహిళా సంఘాల ఖాతాల్లోకి నేరుగా సున్న వడ్డీ రుణాలు: జగన్

మహిళా సంఘాల ఖాతాల్లోకి నేరుగా సున్న వడ్డీ రుణాలు అందిస్తామని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు.వంద రోజుల పాలనలో అనేక ప్రజోపయోగమైన కార్యక్రమాలను చేపట్టినట్టుగాఆయన వివరించారు.

 

చంద్రయాన్-2 గురించి తెలుసుకోవాల్సిన ఆరు విషయాలు

భారతదేశ మొట్టమొదటి మూన్ లాండర్ (చంద్రుడిపై దిగనున్న లాండర్ ) విక్రమ్, సెప్టెంబరు 2వ తేదీనాడు విజయవంతంగా చంద్రయాన్ స్పేస్ క్రాఫ్ట్ నుండి విడిపోయింది. చంద్రుడి దక్షిణధ్రువం  పైన రేపు తెల్లవారుఝామున 1.30-2.30గంటల మధ్య దిగనుంది

 

జింబాబ్వే మాజీ అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే కన్నుమూత

జింబాబ్వేకు సుధీర్ఘకాలం పాటు దేశాధ్యక్షుడిగా పనిచేసిన రాబర్ట్ ముగాబే కన్నుమూశారు. ఆయన వయస్సు 95 సంవత్సరాలు.. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సింగపూర్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

 

ఈ వారం 6సెప్టెంబర్ నుంచి 12 సెప్టెంబర్ వరకు రాశిఫలాలు

ఈ వారం వివిధ రాశుల వారికి రాశిఫలాలు ఇలా ఉన్నాయి

 

భూ కుంభకోణంపై సీఎం జగన్ కు గంటా లేఖ

విశాఖపట్టణంలో భూ కుంభకోణంపై విచారణ జరిపించాలని  మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సీఎం జగన్ కు శుక్రవారం నాడు లేఖ రాశారు.

 

వైఎస్ జగన్ పాలనకు వంద రోజులు: చంద్రబాబుపైనే గురి

ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ వంద రోజులు తీరిక లేకుండానే వ్యవహరించారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో చేసిన పనులను, తీసుకున్న నిర్ణయాలను తిరగదోడడానికే జగన్ ఎక్కువ సమయం కేటాయించినట్లు కనిపిస్తోంది.

 

రేవంత్‌కు షాక్: చక్రం తిప్పిన కాంగ్రెస్ సీనియర్లు

మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి రాకుండా కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు సీనియర్లు చక్రం తిప్పారనే ప్రచారం సాగుతోంది. రేవంత్ రెడ్డి పేరు దాదాపుగా ఖరారైన సమయంలో కాంగ్రెస్ సీనియర్లు ఈ విషయమై పార్టీ నాయకత్వం  వద్ద తమ నిరసనను వ్యక్తం చేసినట్టుగా సమాచారం.

 

గర్భిణి దారుణహత్య..దహనం: మంటల్లో మాడిపోయిన శిశువు

వికారాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ నిండు గర్భిణిని అత్యంత కిరాతకంగా హత్య చేయడమే కాకుండా ఆనవాళ్లు దొరక్కుండా పెట్రోల్ పోసి తగులబెట్టారు. మహిళ శరీరం పూర్తిగా కాలిపోవడంతో ఆమె కడుపులోని బిడ్డ కూడా బయటికి వచ్చి మంటల్లో మాడిపోయింది

 

కొత్త సచివాలయానికే మొగ్గు: నిపుణుల కమిటీ నివేదిక ఇదే...

ప్రస్తుతమున్న పాత సెక్రటేరియట్ భవనం ఉపయోగించడానికి వీలు లేకుండా ఉన్నందున కొత్త సెక్రటేరియట్ భవనం నిర్మించాలని నిపుణుల కమిటీ కేబినెట్ సబ్ కమిటీ సూచించింది. కొత్త సచివాలయ నిర్మాణం కోసం చీఫ్ ఇంజనీర్లతో తెలంగాణ ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది.ఈ కమిటీ ఇటీవలనే తన నివేదికను కేబినెట్ సబ్ కమిటీకి అందించింది.

 

అందుకే స్టీవ్ స్మిత్ ప్రత్యేకం.. సచిన్ పొగడ్తలు

యాషెస్ సిరీస్ లో మరో శతకాన్ని తన ఖాతాలో వేసుకున్న స్మిత్ పై పొగడ్తలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా, ఇండియన్ క్రికెటర్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అంతటివాడు సైతం స్మిత్ బ్యాటింగ్ ప్రదర్శనకు ముగ్ధుడయ్యాడు. ఈ సందర్భంగా ట్విట్టర్ లో ఆసీస్ చిచ్చరపిడుగుపై వ్యాఖ్యలు చేశాడు.

 

యూఎస్ ఓపెన్ ఫైనల్‌లో అడుగుపెట్టిన సెరెనా

అమెరికా టెన్నిస్ సంచలనం సెరెనా విలియమ్స్ యూఎస్ ఓపెన్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం మహిళల సింగిల్స్ సెమీస్‌లో ఐదో సీడ్ స్వితోలినాపై సెరెనా 6-3, 6-1 తేడాతో విజయం సాధించింది

click me!