Asianet News TeluguAsianet News Telugu

కమీషన్లు దండుకునే బతుకు మీది: చంద్రబాబుపై విజయసాయిరెడ్డి ఫైర్

ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా చంద్రబాబు నెరవేర్చలేదని ఆరోపించారు. ప్రైవేటు ఆపరేటర్ల కోసం ఆర్టీసీని కొల్లగొట్టారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. విలువైన భూములను తన వాళ్లకు మల్టీప్లెక్సుల నిర్మాణాలకు లీజుకిచ్చారని విజయసాయిరెడ్డి విమర్శించారు. 

ysrcp mp vijayasaireddy fires on ex cm chandrababu naidu
Author
Amaravathi, First Published Sep 6, 2019, 2:57 PM IST

అమరావతి: మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం దిశగా జగన్ సర్కార్ పనిచేస్తోందని తెలిపారు. కార్మికులకు సీఎం జగన్‌ ఇచ్చిన మాట నిలుపుకొని ఊపిరి పోశారని స్పష్టం చేశారు. 

ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా చంద్రబాబు నెరవేర్చలేదని ఆరోపించారు. ప్రైవేటు ఆపరేటర్ల కోసం ఆర్టీసీని కొల్లగొట్టారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. విలువైన భూములను తన వాళ్లకు మల్టీప్లెక్సుల నిర్మాణాలకు లీజుకిచ్చారని విజయసాయిరెడ్డి విమర్శించారు. 

ఆర్టీసీని చంద్రబాబు మూసివేసే దశకు తీసుకెళ్తే జగన్ మాత్రం ఇచ్చిన మాట నిలుపుకొని ఊపిరి పోశారని స్పష్టం చేశారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించి కమీషన్లు దండుకునే బతుకు చంద్రబాబుదంటూ ధ్వజమెత్తారు. 

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే కక్కలేక మింగలేక తంటాలు పడుతున్నారంటూ చంద్రబాబును ఎద్దేవా చేశారు. హెరిటేజ్ కోసం ఏపీ డెయిరీని నాశనం చేసిన చరిత్ర చంద్రబాబు నాయుడదంటూ తిట్టిపోశారు. తన కుటుంబం, సొంత మనుషుల కోసమే 40 ఏళ్లు చంద్రబాబు ఆరాటపడ్డారని విజయసాయిరెడ్డి ఘాటుగా విమర్శించారు.  

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి 60 వేల మంది కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపడం అసాధారణ నిర్ణయమంటూ జగన్ పై ప్రశంసలు కురిపించారు. సీఎం జగన్ సాహసాన్ని అభినందించడానికి పచ్చ బానిస మేధావులెవరికీ నోరు రావడం లేదంటూ సెటైర్లు వేశారు. కుల మీడియా అయితే విలీనం అసంభమవమని మొన్నటి వరకు పస లేని వాదనలు తెరపైకి తెచ్చిందంటూ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios