రాజోలు: తెలంగాణలో యూరియా కోసం రైతు చనిపోవడం బాధాకరమన్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. రైతు మరణంపై విచారం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా దిండిలో జనసేన పార్టీ మేథోమథన సదస్సులో పాల్గొన్న పవన్ కళ్యాణ్ యూరియా కోసం రైతు మరణించిన వార్తపై ఆవేదన వ్యక్తం చేశారు. 

అయితే రైతు మరణించిన ఘటనపై బాధ్యతాయుత పదవిలో ఉన్నవారు సరైన రీతిలో స్పందించాలని కోరారు. రైతుల డిమాండ్‌కు తగిన విధంగా విత్తనాలు, ఎరువులు సరఫరా చేయడం ప్రభుత్వం బాధ్యత అని గుర్తు చేశారు. 

యూరియా కోసం క్యూలో గంటల తరబడి నిలబడి గుండెపోటుతో చనిపోయిన రైతు ఎల్లయ్య కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణం రైతాంగానికి అవసరమైన ఎరువులు యుద్ధ ప్రాతిపదికన అందుబాటులోకి తీసుకురావాలని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. 

ఈ వార్తలు కూడా చదవండి

తెలంగాణలో యూరియా కష్టాలు: క్యూ లైన్లో స్పృహ కోల్పోయిన మహిళా రైతు

విషాదం: యూరియా కోసం క్యూలైన్లో నిలబడ్డ రైతు మృతి

యూరియా కోసం క్యూలో నిలబడ్డ రైతు మృతి: ప్రభుత్వ హత్య అంటూ కాంగ్రెస్ మండిపాటు