ఎంతో కాలంగా ఓ యువకుడిని ప్రేమించింది. ఎన్నోసార్లు తన ప్రేమను అతనికి తెలియజేయాలని అనుకుంది కానీ చెప్పలేకపోయింది. దీంతో ఓ మాష్టర్ ప్లాన్ వేసింది. తన ప్రియుడిని దక్కించుకోవడానికి పెళ్లి నాటకం ఆడింది. పెళ్లి కూతురులా ముస్తాబై... తన ప్రియుడిని పెళ్లికి ఆహ్వానించింది. ఆ పెళ్లిలో ఆమె అతనికి ఊహించని షాక్ ఇచ్చింది. ఈ సంఘటన యూకేలో చోటుచేసుకుంది.

ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే... అలేషా పిలా(36) గత కొంతకాలంగా పాల్(40) అనే వ్యక్తిని ప్రేమిస్తోంది. అయితే.. తన ప్రేమ విషయం తెలిజేయడానికి ఆమెకు మంచి సందర్భం ఏమీ దొరకలేదు. దీంతో.. తానే ప్రత్యకంగా ఓ సందర్భంగా క్రియేట్ చేసి మరీ తన ప్రేమ విషయాన్ని తెలియజేసింది. ముందుగా తన బాయ్ ఫ్రెండ్ కి తన పెళ్లి అని చెప్పి... ఆ పెళ్లికి రావాలని అతనిని కోరింది.

నిజంగానే ఆమె పెళ్లి అనుకొని అతను అక్కడికి వచ్చాడు. అతనిలానే చాలా మందిని ఆలేషా ఆహ్వానించింది. వారంతా పెళ్లికి వచ్చారు. ఆలేషా కూడా అచ్చం పెళ్లికూతురులా తెలుపు రంగు గౌను ధరించి అందంగా ముస్తాబయ్యింది. పెళ్లి కొడుకు మాత్రం కనపడటం లేదంటబ్బా అని అందరూ ఆకస్తిగా చూస్తున్న సమయంలో... ఆలేషా మైక్ అందుకొని పాట పాడింది. ఆ పాటలో తాను పెళ్లి చేసుకునేది పాల్ ని అని చెప్పింది. ఆ తర్వాత వెళ్లి.. తన బాయ్  ఫ్రెండ్ పాల్ కి ముందు మోకాలిపై కూర్చొని.. నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది.

పాల్ తోపాటు పెళ్లికి వచ్చిన వారంతా  కూడా షాకయ్యారు. వెంటనే పాల్ కూడా ఆమె ప్రపోజల్ ని ఒకే చేశాడు. తన పెళ్లి సంగతిని ఆలేషా నే స్వయంగా వెల్లడించింది. దీంతో ఈ ఘటన వైరల్ గా మారింది.