ఆరు రోజుల పసికందుని ఓ మహిళ హ్యాండ్ బ్యాగులో కుక్కింది. అనంతరం ఆ బ్యాగును తీసుకొని విమానంలో వేరే దేశానికి చెక్కేయాలని ప్లాన్ చేసింది. కానీ చివరకు ఎయిర్ పోర్టు అధికారులకు చిక్కింది. ఈ సంఘటన పిలిఫ్పీన్స్‌లో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. అమెరికాకు చెందిన మహిళ  దేశాన్ని విడిచి వెళ్లే క్రమంలో మనీలా ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. ఈ క్రమంలో ఎయిర్‌పోర్టు తనిఖీ విభాగం అధికారులు సదరు మహిళ బ్యాగ్‌ను​ తెరిచి చూడగా అందులో చిన్నారి కనిపించింది.

ఈ ఘటన గురించి పిలిఫ్పీన్స్‌ ఇమిగ్రేషన్‌ బ్యూరో ప్రతినిధి మాట్లాడుతూ.. 43 సంవత్సరాల ప్రయాణికురాలి బ్యాగులో ఓ పసిపాపను గుర్తించినట్లు తెలిపారు. అయితే ఎయిర్‌పోర్టులోకి మహిళ ఒంటరిగా ప్రవేశించిందని, తన వ్యక్తిగత పాస్‌పోర్టు అధికారులకు సమర్పించిన అనంతరం తనిఖీలు నిర్వహించే సమయంలో ఈ విషయం బయటపడిందని వెల్లడించారు. 

కాగా ఆ చిన్నారి మయస్సు కేవలం ఆరు రోజులు మాత్రమే అని, మహిళ వద్ద చిన్నారికి సంబంధించిన ఎలాంటి వివరాలు లేకపోవడంతో  పూర్తి వివరాలు తెలయలేని తెలిపారు. ఈ క్రమంలో అధికారులు మహిళను విచారించగా చిన్నారికి వరుసకు అత్తయ్య అవుతానని  తెలిపింది. అయితే ఈ విషయం పై ఆమె వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో అనుమానం వచ్చిన అధికారలు ఆమెను అరెస్ట్‌ చేసి దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.