జింబాబ్వేకు సుధీర్ఘకాలం పాటు దేశాధ్యక్షుడిగా పనిచేసిన రాబర్ట్ ముగాబే కన్నుమూశారు. ఆయన వయస్సు 95 సంవత్సరాలు.. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సింగపూర్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. దాదాపు మూడు దశాబ్ధాలకు పైగా జింబాబ్వేను ముగాబే పరిపాలించారు.

1924 ఫిబ్రవరి 21వ తేదీన జన్మించిన ఆయనకు తొలి నుంచి నాయకత్వ లక్షణాలు ఎక్కువ. ప్రభుత్వాన్ని విమర్శించినందుకు గాను 1964లో రొడిషీయా ప్రభుత్వం పదేళ్ల పాటు ముగాబేను జైళ్లో ఉంచింది. 1973లో జైలులో ఉండగానే ఆయన జింబాబ్వే ఆఫ్రికన్ నేషనల్ యూనియన్ పార్టీకి అధ్యక్షుడయ్యారు. 2017లో ఆ దేశ సైన్యం రాబర్ట్ ముగాబేను పదవీచ్యుతుడిని చేసింది.