హైదరాబాద్: ఆస్తుల కేసులో తనకు మినహాయింపు ఇవ్వాలని  కోరుతూ ఏపీ సీఎం జగన్ సీబీఐ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా పడింది.

ఆస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఏపీ సీఎం వైఎస్ జగన్ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో వైఎస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మి మాత్రమే హాజరయ్యారు. ఈ కేసులో 11 చార్జీషీట్లపై విచారణ జరిపిన న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది.

సీఎంగా అధికారిక కార్యక్రమాల్లో బిజీగా ఉన్నందున తన వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలని సీబీఐ కోర్టును జగన్ తరపు న్యాయవాది ఆశోక్ రెడ్డి కోరారు.సీఎం హోదాలో కోర్టుకు హాజరు కావాలంటే ప్రోటోకాల్‌తో పాటు బందోబస్తుకు భారీ వ్యయం అవుతోందని జగన్ పిటిషన్ లో కోరారు.ఈ పిటిషన్ పై ఈ నెల 20న విచారణ చేయనున్నట్టు కోర్టు తెలిపింది.

సంబంధిత వార్తలు

సీబీఐ కోర్టులో సీఎం జగన్ పిటీషన్

ఆస్తుల కేసులో సీఎం జగన్ కు ఊరట: ఆస్తులు తిరిగి ఇచ్చేయాలని ఈడీకి ట్రిబ్యునల్ ఆదేశం