తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..

12:00 AM (IST) May 29
భారతదేశం నుండి ఇరాన్‌కు వెళ్ళిన ముగ్గురు భారతీయులు కనిపించకుండా పోయారని టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం ధృవీకరించింది. వారిని వెతికేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపింది.
11:50 PM (IST) May 28
ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ అదరగొట్టింది. ఏకంగా ఆరు పతకాలు గెలుచుకుంది. 4x400 మీటర్ల మిక్స్‌డ్ రిలే జట్టు బంగారం గెలిచింది. తేజస్విన్ శంకర్ డెకాథ్లాన్‌లో రజతం సాధించాడు.
11:36 PM (IST) May 28
Asian Athletics Championships: 26వ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ రెండో రోజు భారత్ 4x400 మీటర్ల మిక్స్‌డ్ రిలేలో గోల్డ్ మెడల్ సహా 8 పతకాలు గెలుచుకుంది.
11:31 PM (IST) May 28
భారత దేశంలో మరోసారి కరోనా కలవరపెడుతోంది. ఇప్పటికే యాక్టివ్ కేసులు వెయ్యికంటే ఎక్కువయ్యాయి… కొన్ని మరణాలు కూడా సంభవించాయి. తాజాగా మరో మరణం చోటుచేసుకుంది.
11:04 PM (IST) May 28
గూగుల్ కంపెనీ ప్రోడెక్ట్స్ చాలా స్పెషల్ గా ఉంటాయి. అందుకే గూగుల్ పిక్సెల్ చాలా మందికి ఫేవరేట్ ఫోన్ అయ్యింది. త్వరలో పిక్సెల్ 10 సిరీస్ రిలీజ్ కానుంది. ఇప్పుడు దీని గురించి కొంత సమాచారం లీకైంది. ఆ వివరాలు తెలుసుకుందాం రండి.
10:59 PM (IST) May 28
అమెరికాలోని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం కరోనా కొత్త వేరియంట్ NB.1.8.1 వేగంగా వ్యాప్తి చెందుతోందట. ఇప్పటికే దీని బారినపడి ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య పెరిగిందట.
10:47 PM (IST) May 28
Stress Busting:మనం ఎన్నో కారణాల వల్ల మానసిక ఒత్తిడికి గురవుతుంటాం. ఈ స్ట్రెస్ ఆరోగ్యానికి మంచిది కాదు. అందుకే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఒత్తిడికి తగ్గించుకోవాలి. 5 నిమిషాల్లో మనసును శాంతపరిచే 5 అద్భుతమైన చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
10:26 PM (IST) May 28
ఈ జూన్ అంటే వచ్చేనెలలో పాకిస్తాన్‌కు చైనా 3.7 బిలియన్ డాలర్ల లోన్ దక్కునుంది. ఈ రుణం యువాన్‌లో ఇవ్వనుండటం విశేషం. డాలర్ ఆధిపత్యాన్ని సవాలు చేస్తూ చైనా తమ కరెన్సీలోనే డబ్బులు ఇస్తోంది.
10:21 PM (IST) May 28
Chandrababu calls NTR the soul of Telugu Pride: "ఎన్టీఆర్ కేవలం మూడు అక్షరాల పేరు కాదు.. ఆయన తెలుగువారి ఆత్మగౌరవం.. పేదల హృదయాల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే తీపి జ్ఞాపకం" అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
09:25 PM (IST) May 28
India Pakistan Border: పాకిస్తాన్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో పహల్గామ్ దాడి , ఆపరేషన్ సింధూర్ తర్వాత గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ & కాశ్మీర్‌లలో భారీ ఎత్తున మరోసారి మాక్ డ్రిల్స్ నిర్వహిస్తోంది భారత్.
09:07 PM (IST) May 28
గాజాలోని హమాస్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. బుధవారం ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్ లో కీలక నేత హతమయ్యాడు. ఈ విషయాన్ని స్వయంగా ఇజ్రాయెల్ ప్రధాని ధృవీకరించారు.
08:39 PM (IST) May 28
Travel Guide : ఇప్పటికే దేశవ్యాప్తంగా వర్షాలు మొదలయ్యాయి. ఈ తొలకరి వానల్లో అంటే జూన్ లో ఈ ప్రాంతాల అందాలు రెట్టింపవుతాయి. అలాంటి 7 ప్రాంతాలగురించి ఇక్కడ తెలుసుకుందాం.
07:44 PM (IST) May 28
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక వ్యక్తికి కులం కాదని, అతని చదువే గొప్పతనం తీసుకొస్తుందని అన్నారు. బాబూ జగ్జీవన్‌రామ్ భవన్‌లో జరిగిన గురుకుల అవార్డుల కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
07:21 PM (IST) May 28
గ్రహాల చలనంలో మార్పులు మనిషి జ్యోతిష్యంపై ప్రభావం చూపుతుందని పండితులు చెబుతుంటారు. వచ్చే నెలలో ఇలాంటి మార్పు రానుంది. జూన్‌లో సూర్యుడు, బృహస్పతి ఒకే రాశిలోకి వస్తుండడంతో 5 రాశులపై ప్రభావం చూపనుంది.
07:16 PM (IST) May 28
Covid: ఐఐటీ ఇండోర్, ఐసీఎంఆర్ పరిశోధనలో కరోనా డెల్టా వేరియంట్ సైలెంట్ హార్ట్ ఎటాక్, థైరాయిడ్ వంటి సమస్యలకు దారితీస్తుందని తేలింది.
06:43 PM (IST) May 28
బ్యాంకులు నిత్యం స్థిర డిపాజిట్లపై (ఎఫ్‌డీ) వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రిస్క్ లేని పెట్టుబడుల కోసం చూస్తున్న వారికి పోస్టాఫీసు ప్రభుత్వ పథకాలు ఉత్తమ ఎంపిక. వీటిలో రిస్క్ లేకుండా ఎఫ్‌డీల కన్నా ఎక్కువ వడ్డీ లభిస్తుంది.
06:16 PM (IST) May 28
Kharif Crops MSP Hike: కేంద్ర ప్రభుత్వం ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరను పెంచింది. ఎంఎస్పీ పెంపుతో పాటు రుణాలపై వడ్డీ రాయితీని కూడా ప్రకటించింది.
06:13 PM (IST) May 28
మహీంద్రా కంపెనీ నుంచి వస్తున్న XUV3XO ఇండియాలో మొదటి స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ కానుంది. మారుతి సుజుకి, హ్యుండై, కియా కంపెనీలు కొత్త హైబ్రిడ్ కార్లు తీసుకొస్తున్నాయి. వీటికి పోటీగా XUV3XO మార్కెట్‌లోకి ఎప్పుడు వస్తుందో తెలుసుకుందామా?
05:43 PM (IST) May 28
మంచు విష్ణుకు ఇబ్బందులు తప్పడంలేదు. వరుస వివాదాలు, కేసులతో పాటు.. రీసెంట్ గా కన్నప్ప సినిమా వల్ల కూడా సమస్యలు ఫేస్ చేస్తున్నాడు విష్ణుకి. ఇక తాజాగా మంచు హీరో సుప్రీమ్ కోర్డును ఆశ్రయించారు. ఎందుకంటే?
05:28 PM (IST) May 28
అమెరికా టెక్ దిగ్గజ కంపెనీ ఐబీఎం లో భారీగా ఉద్యోగాల కోత జరిగింది. ప్రపంచంలో టాప్ కంపెనీల్లో ఒకటైనా ఐబీఎం ఉద్యోగులను తీసేయడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. దీనికి కారణం ఆర్టిపీషియల్ ఇంటెలిజెన్స్ అనే నిపుణులు చెబుతున్నారు.
05:22 PM (IST) May 28
ఆన్‌లైన్ న్యూస్ ప్లాట్‌ఫామ్ 1xBat కీలక నిర్ణయం తీసుకుంది. యువ ప్రతిభను ప్రోత్సహించడమే లక్ష్యంగా కీలక ఒప్పందం చేసుకుంది. TNPL 2025కి అధికారిక భాగస్వామిగా మారింది.
05:18 PM (IST) May 28
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, టిడిపి జాతీయాధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు స్పీచ్ అంటే చాలా సీరియస్ గా సాగుతుంది. కానీ ఆయన ఎన్టిఆర్ జయంతి సందర్భంగా కడప మహానాడు వేదికగా కవితాత్మకంగా మాట్లాడారు.
05:08 PM (IST) May 28
Inspiring stories: మహారాష్ట్రకు చెందిన యువకుడు రామదాస్ మర్బాడే పానీపూరీలు అమ్ముతూ చదువుకుని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శ్రీహరికోట స్పేస్ సెంటర్లో ఉద్యోగం సాధించాడు. అతని ప్రయాణం ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది.
04:42 PM (IST) May 28
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి సంచలన నిర్ణయాలతో యావత్ దేశాన్ని గడగడలాడిస్తున్నాడు. ఈ క్రమంలోనే అమెరికా ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో తెలుగు విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడుతోంది.
04:02 PM (IST) May 28
ఆంధ్రప్రదేశ్‌కు HAL తరలిస్తారన్న ప్రచారంపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందించారు. ఎట్టి పరిస్థితులో ఇది జరగనివ్వబోమని… రాష్ట్ర ఆస్తులను కాపాడుకుంటామని స్పష్టం చేశారు.
04:01 PM (IST) May 28
సృష్టిలో భూమిపై మాత్రమే కాకుండా ఇతర గ్రహాలపై కూడా జీవులు ఉన్నాయన్నది ఎన్నో ఏళ్ల నుంచి వినిపిస్తోన్న వాదన. అయితే ఇందులో ఎంత వరకు నిజం ఉందన్నదానిపై మాత్రం ఇంత వరకు స్పష్టత రావడం లేదు.
03:59 PM (IST) May 28
IPL 2025: గత ఐపీఎల్ లో ఛాంపియన్ గా నిలిచిన కోల్ కతా నైట్ రైడర్స్ 2025 సీజన్ లో గొప్ప ప్రదర్శన చేయలేకపోయింది. ప్లేఆఫ్స్ చేరకుండానే ఐపీఎల్ 2025 నుంచి అవుట్ అయింది.
03:59 PM (IST) May 28
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో సినిమా రాబోతుందా..? ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిన ఈ విషయంలో నిజం ఎంత?
03:43 PM (IST) May 28
IPL 2025 Top 5 Six Hitters: ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్ దశకు చేరుకుంది. ఈ సీజన్ లో కూడా బ్యాటర్ల మధ్య సిక్సర్ల పోటీ కనిపించింది. అయితే, అత్యధిక సిక్సర్లు కొట్టిన టాప్ 5 బ్యాట్స్‌మెన్లు ఎవరో మీకు తెలుసా?
03:08 PM (IST) May 28
రాయలసీమలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడులో ఓ డిమాండ్ బలంగా వినిపిస్తోంది. అదే లోకేష్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించాలని. తాజాగా మరో ఎమ్మెల్యే కూడా కడప మహానాడు వేదికపైనే, చంద్రబాబు ముందే ఈ డిమాండ్ చేసారు.
02:42 PM (IST) May 28
ప్రపంచవ్యాప్తంగా ద్విచక్ర వాహన కంపెనీలన్నీ ఎలక్ట్రిక్ వాహన విభాగంలోకి అడుగుపెడుతున్నాయి. KTM కూడా ఎలక్ట్రిక్ బైక్ తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.
02:05 PM (IST) May 28
భారతదేశంలో ఉన్న షేక్ హసీనా పై బంగ్లా ట్రైబ్యునల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. రాజకీయ అల్లర్ల సమయంలో ఆమె దేశం విడిచి భారత్ చేరారు.
01:42 PM (IST) May 28
రియల్‌మీ GT 7 ప్రో కంటే తక్కువ ధరకే GT 7 ఇండియాలో లాంచ్ అయ్యింది. GT 6 మాదిరిగానే ధర ఉంది. దీనిలో శక్తివంతమైన డైమెన్సిటీ 9400e ప్రాసెసర్, 7000mAh బ్యాటరీ 120W ఫాస్ట్ ఛార్జింగ్‌తో, అద్భుతమైన కెమెరా సామర్థ్యాలు ఉన్నాయి.
01:33 PM (IST) May 28
కజకిస్తాన్‌లో జరిగిన ఆసియా-ఓషియానియా జూనియర్ డేవిస్ కప్ లో భారత టెన్నిస్ ప్లేయర్స్ ను పాక్ ఆటగాళ్లు అవమానించారు. భారత్ చేతిలో ఓటమిని తట్టుకోలేకపోయిన పాక్ ఆటగాళ్లు ఏం చేసారంటే…
12:57 PM (IST) May 28
పాకిస్థాన్ కు చెందిన ఓ మాజీ ఎంపీ గత 25 ఏళ్లుగా భారతదేశంలో ఐస్ క్రీంలు అమ్ముకుంటున్నాడు. అతడు రాజకీయాలను వదిలేసి, ఆస్తిపాస్తులను కాదని ఇలా ఇండియాలో ఎందుకుంటున్నాడో ఇక్కడ తెలుసుకుందాం.
12:47 PM (IST) May 28
నందమూరి తారక రామరావు 102వ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మహానాడు వేదికగా సీనియర్ ఎన్టీఆర్‌కు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జీవితానికి సంబంధించిన ఓ వివాస్పద అంశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
12:32 PM (IST) May 28
పనిమనిషికి పెళ్లి కుదిరి వెళ్లి పోతుండడంతో ఓ ఇంటి యజమానురాలు కన్నీటి వీడ్కోలు చెప్పిన సంఘటన హృదయాన్ని తాకుతుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
11:42 AM (IST) May 28
ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. కానీ పాకిస్థాన్‌లో మాత్రం తగ్గుతున్నాయి. మన ఇండియాలో మాదిరిగానే పాకిస్థాన్ లో కూడా బంగారానికి బాగా డిమాండ్ ఉంది. అయినా కూడా ధరలు మాత్రం పడిపోతున్నాయి. దీనికి కారణాలు ఏంటంటే..
11:29 AM (IST) May 28
ఆస్తమా లేదా ఉబ్బసం అనేది ఒక వ్యాధి. దీన్ని తగ్గించటానికి పలు రకాల మందులు అందుబాటులో ఉన్నప్పటికీ కొంతమంది చేప మందును బాగా విశ్వసిస్తుంటారు. మరి చేప మందు నిజంగానే ఈ జబ్బును తగ్గిస్తుందా? అనే విషయాలు ఈ కథనంలో..
11:02 AM (IST) May 28
దేశంలో డిజిటల్ పేమెంట్స్ రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఇందుకు అనుగుణంగానే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా యూజర్ల అవసరాలకు అనుగుణంగా మార్పులు చేస్తోంది.