గూగుల్ కంపెనీ ప్రోడెక్ట్స్ చాలా స్పెషల్ గా ఉంటాయి. అందుకే గూగుల్ పిక్సెల్ చాలా మందికి ఫేవరేట్ ఫోన్ అయ్యింది. త్వరలో పిక్సెల్ 10 సిరీస్ రిలీజ్ కానుంది. ఇప్పుడు దీని గురించి కొంత సమాచారం లీకైంది. ఆ వివరాలు తెలుసుకుందాం రండి.
గూగుల్ కంపెనీ నుంచి వచ్చిన పిక్సెల్ 9 సిరీస్ సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు పిక్సెల్ 10 సిరీస్ కూడా అదే జోరు కొనసాగించేలా ఉంది. ఆగస్టు 2025లో లాంచ్ కానున్న ఈ సిరీస్ ఇప్పటికే అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. కొత్త కలర్స్, ఫీచర్స్ గురించి ఓ లుక్కేద్దాం.
నాలుగు మోడల్స్‌లో పిక్సెల్ 10
పిక్సెల్ 9 సిరీస్ లాగే ఈ సారి కూడా నాలుగు మోడల్స్‌ను గూగుల్ తీసుకొస్తోంది. అవి పిక్సెల్ 10, పిక్సెల్ 10 ప్రో, పిక్సెల్ 10 ప్రో XL, పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్. ప్రతి మోడల్‌లోనూ కొత్త డిజైన్, హార్డ్‌వేర్ అప్‌గ్రేడ్స్ ఉంటాయని అంచనా. లీక్స్ ప్రకారం ఈ సారి కలర్స్ విషయంలో గూగుల్ కొత్తగా ట్రై చేస్తోంది.
నాలుగు కలర్స్‌లో పిక్సెల్ 10
పిక్సెల్ 10 నాలుగు కలర్స్‌లో రానుంది. అవి ఒబ్సిడియన్ (బ్లాక్), బ్లూ, ఐరిస్ (లైట్ పర్పుల్), లిమోన్‌సెల్లో (బ్రైట్ యెల్లో). పిక్సెల్ 10 ప్రో, పిక్సెల్ 10 ప్రో XL మోడల్స్‌కి గ్రీన్, పోర్సిలైన్ (వైట్), ఒబ్సిడియన్, స్టెర్లింగ్ (గ్రే) కలర్స్ ఉండొచ్చు.
ప్రతి కలర్ వేరియంట్‌కి 40 కొత్త థీమ్డ్ వాల్‌పేపర్స్‌ను కూడా గూగుల్ రిలీజ్ చేయనుంది.
పిక్సెల్ 10 సిరీస్ ఫీచర్స్ ఇవే..
పిక్సెల్ 10 సిరీస్ ఆండ్రాయిడ్ 16, టెన్సార్ G5 ప్రాసెసర్‌తో రానుంది. మీడియాటెక్ T900 మోడెమ్‌తో కనెక్టివిటీ, బ్యాటరీ లైఫ్ బాగుంటుంది. గూగుల్ AI ఫీచర్స్ కూడా ఉంటాయి.
పిక్సెల్ 10 ప్రో XL ధర 1,200 డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో సుమారు రూ.1,03,900. పిక్సెల్ 10, పిక్సెల్ 10 ప్రో ధరలు రూ.70,000 - రూ.90,000 మధ్యలో ఉండొచ్చు. ఆగస్టులో గ్లోబల్ లాంచ్ జరుగుతుంది. ఇండియాలో కూడా అప్పుడే లాంచ్ కావొచ్చని సమాచారం.