కేవలం బాలయ్య అభిమానులు మాత్రమే కాకుండా, సినీ లవర్స్ సైతం ఎంతగానో ఆసక్తితో ఎదురు చూసిన సినిమా ఎన్టీఆర్ బయోపిక్. ఈ చిత్రం పోస్టర్,ట్రైలర్స్ తో టీజ్ చేస్తూ ఈ రోజు ధియోటర్స్ లోకి రానే వచ్చింది. ఆంధ్రుల అభిమాన నటుడు నందమూరి తారక రామారావు సినీ జీవితాన్ని ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ పేరుతో, రాజకీయ జీవితాన్ని ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ పేరుతో దర్శకుడు క్రిష్ తెరకెక్కించారు.
ఫస్ట్ పార్ట్ గా వచ్చిన ఎన్టీఆర్ కథానాయకుడు.. ఈ రోజు రిలీజ్ అవటంతో అభిమానుల ఆనందానికి తిరుగులేదు. తెలుగు రాష్ట్రాలు, అంత కంటే ముందుగా అమెరికాలో ప్రీమియర్ల ద్వారా ఈ సినిమా విడుదలయింది. అన్ని చోట్ల నుంచి పాజిటివ్ టాక్ రన్ అవుతోంది. ఈ నేఫధ్యంలో ఈ చిత్రం లో హైలెట్స్ ఏమిటనేది ఓ సారి చూద్దాం.
undefined
కుటుంబమా? సినిమానా? ఏది ముఖ్యం అంటే ‘నాకు సినిమానే ముఖ్యము’అని మొదట సీన్స్ లోనే ఎందుకు ఎన్టీఆర్ చెప్పారనే దానికి సమాధానం ఇంటర్వెల్ ముందు చూపటం స్క్రీన్ ప్లే మ్యాజిక్. కొడుకు చావుబతుకుల్లో ఉన్నా సరే నిర్మాత నష్టపోకూడదన్న ఉద్దేశంతో షూటింగ్‌కు వచ్చిన ఎన్టీఆర్ ని తెరపై చూపి, సినిమానే ముఖ్యం అని ఎందుకు చెప్పారో అర్దమయ్యాలా చేస్తారు. అది సినిమాలో హైలెట్ గా నిలుస్తుంది.
తోటరాముడి పాత్ర ఎలా దక్కింది. కృష్ణుడిగా ఎన్టీఆర్ కనిపించినప్పుడు ఎదురైన సంఘటనలను దర్శకుడు చాలా చక్కగా చూపించాడు. కొన్ని సన్నివేశాలు రోమాలు నిక్కబొడిచేలా ఉంటాయి.
మాయాబజార్ సినిమా సందర్భంగా అత్యంత నాటకీయంగా ఎన్టీఆర్ కృష్ణుడి వేషాన్ని ధరించినప్పుడు వచ్చే సీన్లు బాగున్నాయి. రావణబ్రహ్మ, వెంకటేశ్వర స్వామి, దుర్యోధన పాత్రల్లోనూ బాలయ్య తన తండ్రిని గుర్తు చేసారు.
అలాగే ఓవైపు కన్న కొడుకు ప్రాణాలతో పోరాడుతున్నా.. నిర్మాతకు నష్టం రాకూడదన్న భావనతో ఎన్టీఆర్ సినిమా షూటింగ్‌కు వెళ్లడం ప్రేక్షకులను కంటతడి పెట్టించే విషయం.
ఇక అక్కినేని, ఎన్టీఆర్‌ల మధ్య సాన్నిహిత్యం తెలిపై సన్నివేశాలు కూడా హైలెట్. ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్ తరలి రావడం గురించి ఎన్టీఆర్, ఏఎన్నార్ ఏమి మాట్లాడుకున్నారు? అక్కడ రాసిన డైలాగులు హైలెట్ గా అనిపిస్తాయి.
దానవీరశూరకర్ణలో నాగేశ్వరరావును నటించమని ఎన్టీఆర్ అడిగితే అందుకు అన్నపూర్ణమ్మకు ఇచ్చిన మాటలో ఏఎన్నార్ ప్రస్తావించిన విషయాలు చూపే సన్నివేశం.
తిరుపతికి వెళ్లిన తెలుగువారు మద్రాసు వెళ్లి ఎన్టీఆర్‌ను కలవడం అనే సన్నివేశం వినటమే కానీ చూడని వాళ్లకు కళ్లెదరుగా కనిపిస్తుంది.
ఎన్టీఆర్ వయసు మళ్లిన తర్వాత నటించిన కమర్షియల్ చిత్రాలను చూసిన కుటుంబసభ్యులు మరీ ముఖ్యంగా కుమార్తెలు ఎలా ప్రవర్తించారు? అనే విషయం ప్రస్దావించటం బాగుంది.
ఇక ఎన్టీఆర్ ఇంట్లో నగల గురించి, పద్మశ్రీ వచ్చినప్పుడు ఎన్టీఆర్ ఇందిరాగాంధీతో మాట్లాడిన విషయాలు, ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తానన్నప్పుడు బసవతారకం చెప్పిన మాటలు.. రాయలసీమ క్షామం, దివిసీమ ఉప్పెన, ప్రజల కష్టనష్టాలు, ఎమర్జెన్సీ సమయంలో పీతాంబరం తీసిన `అన్నదమ్ముల అనుబంధం` చిత్రం విడుదలలో జరిగిన అంశాలేంటి ఇలాంటి ఎన్నో అంశాలకు ఈ సినిమాలో చోటిచ్చారు. ఎన్టీఆర్ పై అభిమానం ఉన్నవారందిరికీ ఈ విషయాలు చాలా ఇంట్రస్ట్ గా అనిపిస్తాయి.
అలాగే `మనదేశం` నుంచి `వేటగాడు` వరకు ఆయన చేసిన ఎన్నో సినిమాల్లోని సన్నివేశాలను ఇందులో చూపటం బాగుంది.
ఎన్టీఆర్‌గా నందమూరి బాలకృష్ణ, బసవతారకంగా విద్యాబాలన్ నటించారు. నందమూరి కల్యాణ్‌రామ్, రానా, ప్రకాశ్ రాజ్, నరేష్, నిత్యామీనన్, రకుల్ ప్రీత్ సింగ్.. వంటి భారీ తారాగణం కలిగిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. అమెరికాలో కూడా పెద్ద సంఖ్యలో స్క్రీన్లలో విడుదలయింది.
సంబంధిత వార్తలు..
బాలయ్యని చూస్తే అన్నయ్యే గుర్తొచ్చాడు: మోహన్ బాబు
ఎన్టీఆర్ 'కథానాయకుడు'పై నారా లోకేష్ ట్వీట్!
ఎన్టీఆర్ టు ఎన్టీవోడు(‘ఎన్టీఆర్ కథానాయకుడు’రివ్యూ)
ఎన్టీఆర్ 'కథానాయకుడు'.. భార్య సెంటిమెంట్!
ఎన్టీఆర్ 'కథానాయకుడు': చివరి 20 నిమిషాలే..!
ఎన్టీఆర్ 'కథానాయకుడు' థియేటర్ల వద్ద హంగామా!
ఎన్టీఆర్ 'కథానాయకుడు' ట్విటర్ రివ్యూ!
ప్రీమియర్ షో టాక్: ఎన్టీఆర్ కథానాయకుడు
'ఎన్టీఆర్' బయోపిక్.. తెలంగాణ రచయితని తొక్కేశారా..?
'ఎన్టీఆర్' బయోపిక్: విద్యాబాలన్ పాత్ర ఎంతవరకంటే..?
ఎన్టీఆర్ 'కథానాయకుడు'.. అసలు మేటర్ ఉంటుందా..?
ఎన్టీఆర్, ఏఎన్నార్ ల నుండి నేర్చుకున్నవి అవే: బాలకృష్ణ
100 థియేటర్లలో 100 'ఎన్టీఆర్' విగ్రహాలు!
ఎన్టీఆర్ 'బయోపిక్' తొలి షోకి బాలయ్య ముహూర్తం!
‘ఎన్టీఆర్’కు ఆ ఇబ్బంది? బయ్యర్లు డౌట్, ఆన్సర్ ఇదే!
'ఎన్టీఆర్' బయోపిక్: ఆ రెండూ ఎంతో స్పెషల్
నాగార్జున కంటే సుమంత్ బెటర్: బాలకృష్ణ
అనుకోకుండా ఆ మాట చెప్పా: బాలకృష్ణ
బయోపిక్ కు 'తేజ' బై ఎందుకు చెప్పాలంటే.. :బాలకృష్ణ
వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'పై బాలయ్య కామెంట్!
ఎన్టీఆర్ సెన్సార్ టాక్: నో కట్స్.. ఇట్స్ పర్ఫెక్ట్!
మీకేమో అవి.. నాకైతే చంద్రబాబు పాత్రా..? రానా కామెంట్స్!
ఎన్టీఆర్ బయోపిక్ లో అసలు మ్యాటర్ లేనట్లే?
'ఎన్టీఆర్'.. బాలయ్యకి రూ.200 కోట్లు ఇవ్వగలడా..?
'ఎన్టీఆర్' కు అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్!
'ఎన్టీఆర్' బయోపిక్: హీరో రేంజ్ లో చంద్రబాబు క్యారెక్టర్!
ఫ్లాష్: 'ఎన్టీఆర్' బయోపిక్ లో బాలకృష్ణ ఎవరంటే..?