సేంద్రియ సాగుతో సిరుల పంట.. లాభాలు తెచ్చే మార్గమిది

వ్యవసాయం సవాళ్లతో కూడుకున్న పనిగా మారింది. పెట్టుబడి పెరుగుతుండటం.. పంట ధరలు మాత్రం ఆశాజనకంగా లేకపోవడం రైతులను నష్టాల్లోకి నెడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సేంద్రియ సాగుతో లాభాలపై అవగాహన ఉన్నవారు అదే మార్గాన్ని ఎంచుకుంటున్నారు. సేంద్రియ సాగు సిరులను కురిపిస్తున్నది.
 

organic farming produces profits for farmers says agriculture experts

హైదరాబాద్: వ్యవసాయం (Agriculture) చేయడం ఇప్పుడు సవాళ్లతో కూడుకున్న పని. పెట్టుబడి పది.. రాబడి రాదు అన్నట్టుగా ఉన్నది. వ్యయ ప్రయాసల కోర్చి పంట పండించినా.. చివరి నిమిషంలో వరుణ దేవుడు నట్టేట ముంచే ముప్పు ఉంటుంది. తీరా మార్కెట్ యార్డు (Market Yard) కు వెళ్లిన తర్వాత ధరల మాయాజాలంలో చిక్కుకుపోయి పెట్టుబడి (Investment) పెట్టిన పైసలు దక్కించుకుని బయట పడితే చాలు అనే దుస్థితి ఉన్నది. ఈ నేపథ్యంలోనే పెట్టుబడులు తగ్గించి రాబడి (Revenue) అధికంగా ఇచ్చే సాగు పద్ధతులపై అన్వేషణ జరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే నేడు అందుబాటులో ఉన్న సేంద్రియ సాగు (Organic Farming) ప్రస్తావన వస్తున్నది.

పంటసాగులో రసాయన ఎరువుల (Fertilisers) కు పెట్టుబడి పెరగడం.. వాటి మితిమీరిన వినియోగంతో నేల చౌడుబారి పోవడం రెండూ నష్టాన్నే కలిగిస్తున్నాయి. కాబట్టి, సేంద్రియ సాగు బెస్ట్ అనే అభిప్రాయాలు ఎక్కువగా వస్తున్నాయి. అందుబాటులో ఉన్న సహజమైన వనరుల్ని వినియోగించుకుని సేద్రీయ సాగు చేి లాభాలు చేసుకోవాలని చాలా మంది భావిస్తున్నారు. ఇప్పటికే ఇటువైపుగా మొగ్గు చూపి లాభాలు ఆర్జిస్తున్నవారున్నారు. పశ్చిమ గోదావరికి చెందిన ఓ రైతు (Farmers) ఈ సాగు విధానాన్ని అవలంభించి ఆదర్శంగా నిలుస్తున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పెరవలి మండలంలో బొప్పాయి, అరటి, జామతోపాటు వంగ,బెండ, దొండ, చిక్కుడు, పొట్ల, బీర, కాకర వంటి కూరగాయలను సేంద్రీయ విధానంలో సాగు చేసి లాభాలు ఆర్జిస్తున్నారు. ఇదే విధానంలో వరిసాగునూ విజయవంతంగా చేపట్టి.. లాభాలు ఆర్జిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఎకరానికి 40 నుంచి 50 బస్తాల దిగుబడులు సాధిస్తున్నారు. 

భూముల చౌడుబారిపోవడంతో పంట దిగుబడి తగ్గుతున్నది. కాబట్టి, సేంద్రియ సాగులో పశువుల ఎరువు, పచ్చిరొట్ట పైర్ల సాగు వంటివి వీటికి విరుగుడుగా పని చేస్తున్నాయి. అందుకు జనుము, జీలుగ, పిల్లిపిసర వంటి పంటలు వేస్తే ఎకరానికి రెండు టన్నుల ఎరువు అందుతుందని అధికారులు చెబుతున్నారు. అంతేకాదు, సేంద్రియ విధానంలో పండిన పంటకు మార్కెట్‌లో మంచి గిట్టుబాటు ధర పలుకుతుందని వివరిస్తున్నారు.

పంటలపై వచ్చే తెగుళ్ల నివారణకు రకరకాల కషాయాలు తయారు చేసి పంటలపై పిచికారి చేయాలి.

పశ్చిమ గోదావరికి చెందిన ఓ రైతు తాను చేపట్టిన సాగు రైతు గురించి మాట్లాడారు. తాను రెండేళ్లుగా అరటి సాగు సేంద్రియ విధానంలో చేస్తున్నానని చెప్పారు. గతేడాది ఎకరానికి రూ. 50వేల లాభం వచ్చిందని వివరించారు. పెట్టుబడి తక్కువ, నాణ్యమైన దిగుబడి రావడంతో ఈ పంటకు మార్కెట్‌ లో మంచి ధర లభించిందని పేర్కొన్నారు. ఈ ఫలితాలు తనను ఎంతో సంతోష పెట్టాయని, అందుకే ప్రస్తుతం అరటితో పాటు వరి కూడా సేంద్రియ విధానంలో సాగు చేస్టున్నట్టు తెలిపారు. రసాయ ఎరువులు, పురుగు మందుల వినియోగాన్ని మానేసి తెగుళ్ల నివారణకు కేవలం కషాయాలు మాత్రమే వాడుతున్నామని, ఈ విధానంలో సాగు లాభాలను తెచ్చి పెడుతున్నదని వివరించారు. కాబట్టి.. రైతులు నష్టాలను తగ్గించుకునే దారిలో వెళ్లడం సముచిత నిర్ణయమే.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios