సేంద్రీయ వ్యవసాయ కూరగాయలను తింటే ఎన్ని లాభాలున్నాయో..!

ఇప్పుడంతా కెమికల్ మయమైంది. ప్రతి కూరగాయలో ఎన్నో కెమికల్స్ నిండి ఉంటున్నాయి. వీటిని తినడం వల్ల మన ఆరోగ్యానికి జరిగే హాని అంతా.. ఇంతా కాదు. అందుకే ప్రభుత్వాలు సైతం సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ వస్తున్నాయి.
 

How Many Benefits Of Eating Organic Farm Vegetables

ఒకప్పుడు రైతులు సేంద్రీయ వ్యవసాయ పంటలనే పండించే వారు. కానీ ఇప్పుడు ఈ వ్యవసాయం పూర్తిగా మరుగునపడింది. ఎక్కడో ఒకచోట మాత్రమే ఈ సేంద్రీయ పద్దతిలో పంటలను పండిస్తున్నారు. కెమికల్స్ వాడకానికి అలవాటు పడిన ఎంతో మంది రైతులు మాత్రం ఈ సేంద్రీయ వ్యవసాయం వైపు మొగ్గుచూపడం లేదు. 

కానీ కెమికల్స్ ద్వారా పండించిన పంటలు మన ఆరోగ్యానికి ఏ మాత్రం మంచివి కావు. వీటిని తినడం వల్ల వంద ఏండ్లు బతకాల్సిన వాడు యాబై నలబై ఏండ్లకే వివిధ రోగాలొచ్చి చనిపోతున్నారు. అందుకే ప్రభుత్వం సైతం రైతులను సేంద్రీయ వ్యవసాయం  వైపు మళ్లించడానికి ప్రయత్నం చేస్తోంది. 

సేంద్రీయ వ్యవసాయ పద్దతిలో పెద్దగా రిస్క్ ఉండదు. పంట దిగుబడి తక్కువగా వచ్చినా.. దీనివల్ల ఎన్నో లాభాలున్నాయి. అందుకే ప్రస్తుతం చాలా మంది రైతులు మళ్లీ ఈ సేంద్రీయ  వ్యవసాయం వైపు మొగ్గుచూపుతున్నారు. 

మీకు తెలుసా.. మనం కొనుగోలు చేస్తున్న కూరగాయల్లో 90 శాతం పూర్తిగా కెమికల్స్ తో నిండిపోయినవే ఉంటున్నాయి. దీనివల్ల మన ఆరోగ్యం దెబ్బతినడమే కాదు భూతల్లి సారం కూడా దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

అయితే ప్రస్తుత కాలంలో సేంద్రీయ వ్యవసాయం కాస్త వెలుగులోకి వస్తున్నప్పటికీ ఈ వ్యవసాయాన్ని ఎక్కువగా చేస్తున్నది మాత్రం ధనవంతులే. సాధారణ రైతులు మాత్రం ఈ వ్యవసాయం వైపు అడుగులు వేయడం లేదు. దీనికి కారణం వారికి ఈ వ్యవసాయంపై అవగాహన లేకపోవడం. ముఖ్యంగా ఈ పద్దతిలో పంటలను పండించడం రిస్క్ తో కూడుకున్నదని భావించడం. కాబట్టి ఈ వ్యవసాయంపై వారికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతో ఉంది. 

సేంద్రీయ కూరగాయలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.. 

  • పలు అధ్యయనాల ప్రకారం.. సేంద్రీయ వ్యవసాయంలో పండించిన కూరగాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి గుండె సంబంధిత రోగాలు, క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి. అంతేకాదు ఈ యాంటీ ఆక్సిడెంట్స్ మన రోగ నిరోధక వ్యవస్థను కూడా పెంచుతుంది. రకరకాల ఇన్ఫెక్షన్స్, రోగాల  నుంచి మనల్ని కాపాడుతుంది. 
  • గుండె జబ్బులు, డయాబెటీస్ పేషెంట్లు వీటిని తప్పక తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సేంద్రీయ కూరగాయలను తినడం వల్ల మధుమేహుల్లో షుగర్ లెవెల్స్ తగ్గుతాయట. 
  • సేంద్రీయ వ్యవసాయంలో పండించిన నారింజ పండ్లు, ఆకుపచ్చ కూరగాయలల్లో ఐరన్, విటమిన్ ఎ, విటమిన్ సి,విటమిన్ బి కాంప్లెక్స్,  కాల్షియం, జియాక్సంతిన్, పొటాషియం వంటివి పుష్కలంగా ఉంటాయి. 
  • ముఖ్యంగా ఆకు పచ్చ కూరగాయల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. దీనివల్ల జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. అలాగే జీర్ణవ్యవస్థ క్లీన్ అవుతుంది కూడా. విరేచనాలు, మలబద్దకం వంటి సమస్యలు ఇట్టే వదిలిపోతాయి. 
  • ఈ కూరగాయల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్నందున వీటిని తీసుకోవడం వల్ల మీ కడుపు ఎక్కువ సేపు నిండిని అనుభూతి కలుగుతుంది. దీంతో మీరు ఎక్కువగా తినలేరు. దీంతో మీరు సులభంగా బరువు తగ్గొచ్చు. 
  • ఈ కూరగాయల్లో అమైనో ఆమ్లాలు, ప్రోటీన్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. మాంసాహారం తిననివారు ఈ కూరగాయలను తింటే పోషకాహార లోపం ఏర్పడదు. 
  • ఈ కూరగాయలు మీ ఒంట్లో ఉండే విష పదార్థాలను సులభంగా బయటకు పంపేందుకు ఎంతో సహాయపడతాయి. 
  • ఆకు కూరల్లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది టైప్ 2 మధుమేహులకు ఎంతో సహాయపడుతుంది. ప్రతిరోజూ ఈ  కూరలను తింటే డయాబెటీస్ ప్రాబ్లం చాలా వరకు తగ్గుతుంది. 
  • ఉల్లిగడ్డ, వెల్లుల్లిని తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు తగ్గుముఖం పడుతుంది. అంతేకాదు వీటివల్ల ప్రాణాంతకమైన క్యాన్సర్ వంటి రోగాలు వచ్చే అవకాశమే ఉండదు. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios