ప్రకృతి వ్యవసాయంతో విజయగాథలు లిఖిస్తున్న హిమాచల్ మహిళలు..

ప్రకృతి వ్యవసాయంలో దూసుకుపోతున్నారు హిమాచల్ ప్రదేశ్‌లోని మహిళ రైతులు. వారు సహజ పద్దతుల్లో వ్యవసాయం చేపట్టేలా మార్పుకు నాయకత్వం వహిస్తున్నారు.

Himachal Pradesh Women farmers are Scripting Success Stories in Sustainable Farming

వ్యవసాయాన్ని రసాయన ప్రయోగశాల నుంచి బయటకు తేవాలని 2021 డిసెంబర్‌లో Natural Farmingపై జరిగిన జాతీయ సదస్సులో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. వ్యవసాయాన్ని ప్రకృతికి గల సొంత ప్రయోగశాలకు అనుసంధానించాలని చెప్పారు. ప్రకృతి వ్యవసాయంపై దృష్టిసారించాలని 
రైతులకు సూచించారు. ప్రకృతి వ్యవసాయం చేపట్టాలని రైతులకే కేంద్ర ప్రభుత్వం సూచించడం ఇదే మొదటిసారి కాదు. రైతులకు వివిధ ప్రోత్సాహకాలను అందిస్తూ దేశంలోని రైతులను ప్రకృతి వ్యవసాయం ప్రోత్సహించబడుతున్నారు. మార్చి 2021 నాటికి దాదాపు 5,00,000 మంది రైతులు 2,16,000 హెక్టార్ల భూమిలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు.

ఇలా ప్రకృతి వ్యవసాయంలో దూసుకుపోతున్నారు హిమాచల్ ప్రదేశ్‌లోని మహిళ రైతులు. వారు సహజ పద్దతుల్లో వ్యవసాయం చేపట్టేలా మార్పుకు నాయకత్వం వహిస్తున్నారు. శిక్షణ, సామర్థ్యాన్ని పెంపొందించే వర్క్‌షాప్‌ల ద్వారా పొందిన జ్ఞానంతో హిమాచల్‌ ప్రదేశ్‌లోని మహిళలు.. రసాయన రహిత, వాతావరణాన్ని తట్టుకునే ప్రకృతి వ్యవసాయం విధానాలను అవలంబిస్తూ విజయగాథలు లిఖిస్తున్నారు. అంతేకాకుండా తక్కువ ఖర్చుతో వ్యవసాయం చేస్తున్నారు. 

హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రకృతి కృషి ఖుషల్ కిసాన్ యోజన తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా ప్రభుత్వం రైతులకు ప్రకృతి వ్యవసాయం చేయడానికి  ప్రోత్సహకాలు అందజేస్తుంది. దీంతో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మొత్తం రైతుల సంఖ్యలో సగం మంది సహజ వ్యవసాయ పద్ధతిని అవలంబించారు. ముఖ్యంగా మహిళలు ఈ స్థిరమైన వ్యవసాయ పద్ధతిని అవలంబించడంలో తమ సంఘాన్ని బలోపేతం చేసే పనిని చేపట్టారు.

అధికారిక సమాచారం ప్రకారం.. హిమాచల్ ప్రదేశ్‌లో సహజ వ్యవసాయాన్ని అభ్యసిస్తున్న 1.68 లక్షల మంది రైతుల్లో.. 90,000 మంది మహిళలు ఉన్నారు. ఈ సంఖ్య జీవవైవిధ్యంతో అనుబంధం, ఆహార భద్రత వైపు కదలికలో మార్పును సూచించే విధంగా ఉంది. ప్రకృతి వ్యవసాయంతో మహిళా రైతుల స్ఫూర్తిదాయక విజయాలను అందుకుంటున్నారు. అందులో 50 ఏళ్ల సత్యాదేవి ఒక్కరు. ఆమె గురించి వ్యవసాయ శాఖ ఒక కథనాన్ని కూడా ప్రచురించింది. 

అందులో ఆమె రసాయనాలు, స్ప్రేలు, ఎరువులు ఉపయోగించే సాంప్రదాయ వ్యవసాయ కార్యకలాపాల నుంచి జీరో బడ్జెట్ సహజ వ్యవసాయానికి ఎలా మారారనే విషయాన్ని వివరించారు. జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ అనేది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం ప్రారంభించిన డ్రైవ్.  వాణిజ్య పంటలు, పండ్లను పండించడంలో రసాయనాల వినియోగాన్ని అంతం చేయాలనే ఉద్దేశంతో దీనిని తీసుకొచ్చారు. ఈ  జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్‌తో సత్య దేవి స్థిరమైన వ్యవసాయం(పర్యావరణ సూత్రాలు పాటించి) కొనసాగించడంతో విజయం సాధించారు. 

సంవత్సరాలుగా అమలు చేస్తున్న జీరో బడ్జెట్ వ్యవసాయ వ్యూహం చాలా మంచి ఆదరణ పొందింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులు కూడా రాష్ట్ర రైతుల నుండి చిట్కాలను పొందడానికి హిమాచల్ ప్రదేశ్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక్కడి మహిళలు ప్రకృతి వ్యవసాయానికి బ్రాండ్ అంబాసిండర్‌లుగా మారారు. వ్యవసాయ సంబంధిత కార్యకలాపాల కోసం గ్రామీణ మహిళలను ‘కృషి సఖీలు’ (కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్‌లు)గా ఎంపిక చేశారు. ఆదాయం, పర్యావరణం, పోషకాహారం దృష్టిలో ఉంచుకుని.. హిమాచల్ ప్రదేశ్ ప్రకృతిక్ ఖుషాల్ యోజన ద్వారా సహజ వ్యవసాయ సాంకేతికతలో శిక్షణ, గ్రామ సంస్థ స్థాయిలో కాన్సెప్ట్ సీడింగ్, పర్యావరణ పద్ధతుల శిక్షణ, ప్రచారం, అగ్రి-న్యూట్రి ఉద్యానవనం మరియు విత్తన బ్యాంకుల నిర్వహణపై మహిళలకు శిక్షణ ఇస్తున్నారు. ఇది వారి ఆలోచనలను మారుస్తోంది. డిసెంబర్ 2021 వరకు.. హిమాచల్ ప్రదేశ్‌లోని 12 జిల్లాల్లో 502 ‘కృషి సఖి’లకు 23 శిక్షణా సమావేశాలు నిర్వహించబడ్డాయి.

2022-23 బడ్జెట్ ప్రసంగంలో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్.. 50,000 ఎకరాలను సహజ వ్యవసాయం కిందకు తీసుకువస్తామని ప్రకటించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆ రైతులు నమోదు చేయబడతారని.. వారిని సహజ రైతులుగా ధృవీకరించబడతారని చెప్పారు. వ్యవసాయ శాఖ ప్రకారం.. సంప్రదాయ వ్యవసాయానికి హెక్టారుకు దాదాపు రూ. 2.30 లక్షలు ఖర్చు అవుతుండగా.. సహజ వ్యవసాయానికి హెక్టారుకు సుమారు రూ. లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios